నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా!! నేను ఒక అమ్మాయిని ప్రేమించా. తను, నేను వన్ ఇయర్ చాలా ప్రేమించుకున్నాం. బట్ చిన్న గొడవతో నాకు దూరమైపోయింది. నాతో మాట్లాడంలేదు. ఇప్పుడు మళ్లీ తను వేరే అబ్బాయిని లవ్ చేస్తోందని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడి కోసం తను చెయ్యి కూడా కోసుకుందని తెలిసింది. కానీ తను లేకుండా నేను ఉండలేకపోతున్నా. తను మనసులో నేను లేనని తెలిసి కూడా తనపైన ప్రేమ తగ్గడంలేదు. బనానా జోక్స్ వద్దు అన్నా ప్లీజ్. ఏదైనా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్.. ప్లీజ్!! – నాని
నానీ... నువ్వు చాలా గ్రేట్! అమ్మాయి నో అన్నాక కూడా... అదే రేంజ్‌లో లవ్ చేస్తున్నావు! కీప్ ఇట్ అప్!! ‘ఏంటి సార్.. అక్కడ అమ్మాయితో వర్కౌట్ కాలేదని గిలగిల కొట్టుకుంటుంటే.. యు ఆర్ గ్రేట్.. యు ఆర్ గ్రేటర్.. యు ఆర్ గ్రేటెస్ట్ అని డప్పు కొడుతున్నారేంటి సార్!’ మెచ్చుకుంటే కూడా ఏంటి నీలాంబరి ఫీల్ అవుతున్నావు? ‘ఇలా మెచ్చుకునే బదులు మీరు తిడితేనే బెటర్ సార్!!’
నానీ.. నీవు చాలా గ్రేట్! ఎందుకంటే నీ ప్రేమ చాలా గ్రేట్.. నీ పవర్ నీ ప్రేమే!! ప్రేమిస్తూనే ఉండు!!
‘ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని అంటారా సార్!?’ ప్రేమించడానికి అమ్మాయి అవసరమా నీలూ..? ‘గాడిదలను, కోతులను, కుక్కలను ప్రేమించమంటారా సార్?’ నిన్ను నీవు ప్రేమించుకో నిన్ను నువ్వు గౌరవించుకో.. అప్పుడు ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది నానీ.. లైఫ్‌లో ఏదయినా అవ్వాలన్నా.. ఎవరైనా ప్రేమించాలన్నా.. ముందు యు మస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com