నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్!! చాలా రోజుల నుంచి నన్ను ఒక అమ్మాయి చూస్తోంది. చూస్తే లవ్ అంటారా? లేక అమ్మాయిలు క్యాజువల్‌గా చూస్తుంటారా?
– రవి
క్యాజువల్‌గానే చూస్తోంది. ‘సార్! మీరు శాడిస్ట్... సార్!!’ అడిగిన దానికి సమాధానం చెప్పడం శాడిజం ఎలా అవుతుంది? ‘రవి మీరంటే ఎంతో గౌరవంతో రాస్తే...’ ‘ఆం!... గౌరవం లేదు.. జీబ్రా ఈకలు లేవు...’ ‘హ... హ... హ... హా... హా..’ ఏమైంది నీలాంబరీ? ‘జీబ్రాకి ఈకలేంటి సార్?’ గాడిదకు గుడ్డేంటి అని అడగని మీకు జీబ్రాకు ఈకలేంటని అడిగే అర్హత ఎక్కడిది? ‘ఓ... హో.. గౌరవం లేదు, గాడిద గుడ్డు లేదు అని అనకుండా జీబ్రా ఈకలు అన్నారా?’
నువ్వు చూశావా గాడిద గుడ్డును కానీ ఆర్ జీబ్రా ఈకలను కానీ..? ‘హ.. హ.. హ. హా.. చూడలేదు సార్, ఇంతగా నవ్వించకండి కడుపు నొప్పి వస్తుంది.’ రవి చూశాడు! ‘వాట్!?!!?!!’ అమ్మాయి నవ్వడం!! ‘అదా...’ ఆ నవ్వు సిల్లీగా లేదు, క్యాజువల్‌గా ఉంది అని చెప్పా! ‘అంటే నవ్వు వెనక పరమార్థం లేదా సార్?’ పరమార్థం ఉంది... ప్రేమార్థం లేదు!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com