నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. లాస్ట్ టైమ్ ప్రయత్నంలో విఫలం అయ్యాను. దాంతో నేను ప్రేమించిన అమ్మాయి కూడా ‘నీకు జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటా’ అంది. జాబ్ కచ్చితంగా కొడతానని నమ్మకం ఉంది. కానీ, తను ఆ మాట అనడంతో తనపై నమ్మకం పోయింది. దాంతో తనని అవాయిడ్ చేయడం మొదలుపెట్టా. కానీ, తనను మరిచిపోలేకపోతున్నా సార్. సలహా ఇవ్వండి.– ప్రదీప్
ప్రేమకు డబ్బులు అవసరం లేదు!‘అవసరం... లేదా.. సార్?’ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు!!‘ఆర్ యూ ష్యూర్?’ప్రేమించి, రోజూ కలలు కనడానికి... డబ్బు అవసరం లేదు!‘ఏదో తేడా కొడుతోంది! వాట్ ఆర్ యూ సేయింగ్..!?!’పెళ్లికి రొక్కం కావాలి అని చెబుతున్నా.
షాపుకు పోయి అరటిపండ్లు అడిగితే దుడ్లు అడగడా..? సంసారం ఉద్యోగం లేకుండా చల్తా క్యా? అంతగా ఫీల్ అయిపోయి అమ్మాయినిఏదో అనుకునే బదులు, గెట్ ది జాబ్! అండ్ గెట్ ది గర్ల్!!‘ఎంత కఠినమయిన మనస్సు సార్ మీది, నిజం రఫ్‌గా చెప్పేస్తారు.’
యా..!‘ఇదిగో పచ్చి అరటిపండు.. పచ్చి నిజంలా ఉంటుంది తిని చెప్పండి ఎలా ఉందో!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com