నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
సర్! నా వయస్సు 20, నేను మా ఫ్రెండ్ సిస్టర్ పెళ్లికి వెళ్లినప్పుడు ఒక అమ్మాయిని చూశాను. అప్పుడు నా వయస్సు 16. తను నాకు బాగా నచ్చింది. తరవాత ఒక జాతరలో మళ్ళీ చూశాను. మరోసారి ఒక గుడిలో చూశాను. అప్పుడు నాకు అనిపించింది నేనే కాదు తను కూడా నన్ను ప్రేమిస్తుందని. తను నన్ను చూసి నవ్వుతున్నప్పుడు తన కళ్లల్లో ఆ ప్రేమని చూశాను. మరో విషయమేమిటంటే తను మా ఫ్రెండ్ కజిన్. మా ఫ్రెండ్ ఉద్దేశంలో ఇది ప్రేమ కాదు. కానీ నేను ఒప్పుకోలేకపోతున్నాను. సలహా ఇవ్వండి.
– వెంకట్ మోహన్
చెప్పు నీలాంబరీ, వెంకట్ మోహన్‌కి ఆన్సర్ చెప్పు.‘ఏంటి సార్, అమ్మాయిలకందరికీ మీరు ఆన్సర్ చెబుతారు. అబ్బాయ్‌లకు నన్ను చెప్పమంటారు’?బాయ్స్ లైక్ యు మేడం!‘మరి గార్ల్స్‌కి నేను నచ్చనా సార్..?’గార్ల్స్‌కి నువ్వంటే డివోషన్!‘మరి బాయ్స్‌కి..?’
ఎమోషన్!‘అయితే విను వెంకట్ మోహన్... అమ్మాయి నవ్వితే కళ్లల్లో లవ్ కనబడింది కదా నీకు? నీలాంటి గొప్ప ప్రేమికుడిని నేను ఇప్పటి దాకా చూడలేదు. అదే వేళలో ప్రపోజ్ చెయ్యాల్సింది!’‘అప్పుడు గానీ ప్రేమ పిచ్చి కుదిరేది కాదు..! అదేదో సినిమాలో మహేష్ బాబు బ్రహ్మాజీని జాతరలోనే తగులుకుంటాడు, మళ్ళీ లైఫ్‌లో వెంకట్ మోహన్ లైఫ్‌కి పనికి రాకుండాపోతాడు!’
‘సార్. ఆన్సర్ నేనిస్తుంటే.. మధ్యలో ఈ కామెంట్స్ ఏంటి సార్..? నువ్వేమీ పట్టించుకోకు వెంకట్ మోహన్, ఈ సారి అమ్మాయి ఎక్కడ కనబడితే అక్కడ ప్రపోజ్ చేసెయ్యి...’‘అప్పుడు గానీ తిక్క తీరదు! అమ్మాయి ‘హెల్ప్’ అని కేక పెడుతుంది. వీడ్ని కనబడిన వాళ్లల్లా వాయించేస్తారు!’‘సార్, డోంట్ ఇంటర్‌ఫియర్. నువ్వేం భయపడకు మోహన్ వెంకట్, ఇంటికెళ్లి మరీ ప్రపోజ్ చేసెయ్యి!’వాడి పేరు వెంకట్ మోహన్, నాట్ మోహన్ వెంకట్.. టెన్షన్‌లో పేరు మార్చేసావు.‘నాకేమి టెన్షన్ సార్..? ఒక మంచి లవర్‌ని ఎంకరేజ్ చేస్తున్నాను..’
‘మానసికంగా బలోపేతం చేస్తున్నావు గుడ్... కానీ ప్రపోజ్ తరువాత, అంగవైకల్యానికి గురి అయితే... దెబ్బలు మానుతాయి కానీ, గాయాలు మానవు! నీలూ ప్లీజ్ అండర్‌స్టాండ్!’‘కొడతారని పిరికివాడిలా పారిపోమంటారా సార్..!’‘ఇప్పుడు ట్వంటీ ఇయర్స్! కొంచెం సెటిల్ అయ్యాకా ట్రై చేస్తే బెటర్!’ ‘మీరు అరటిపండు రేపు తింటే బెటర్..’ అని విసురుగా టర్నింగ్ ఇచ్చింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com