
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను నాలుగు నెలలుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తను పరిచయమైన మూడు నెలలకే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. తనకు నేనంటే చాలా ఇష్టం. తను గతంలో ఇంకో అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయిని ఇంకా ఇష్టపడుతోంది. మా విషయం ఆ అబ్బాయికి తెలిసి మా ఇద్దర్ని కూర్చోబెట్టి అడిగితే... తనే ఇష్టమని చెప్పి వాడితో వెళ్లిపోయింది.
వెళ్లిన రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి నాకు నువ్వంటేనే ఇష్టం, ఆ అబ్బాయికి భయపడి అలా చెప్పాను’ అంది. నాకు తనంటే ఇంకా ఇష్టముంది కానీ, తన మాటలు నమ్మాలంటే భయంగా ఉంది. చెప్పడం మరచిపోయా! నేను ముస్లిం, తను హిందు. దయచేసి కొంచెం సీరియస్‌గా ఆన్సర్ చెప్పండి.. ప్లీజ్ సర్! – కాలేషా షేక్
నీలాంబరీ... నీలాంబరీ... నీలాంబరీ... ‘పక్కనే పెట్టుకుని అన్ని సార్లు పిలుస్తారేంటి సార్..?’ ఎక్కడ..? నువ్వు ఎక్కడ...? నీలాంబరీ.. వేర్...ఆర్..యూ..? ‘ఏంటి సార్! ఏమైంది..? మీ ముందే ఉన్నానుగా..?’ నీలాంబరీ... నీలాంబరీ... ‘సార్! కళ్లు పోయాయా ఏంటి..?’
అంతా మసక మసకగా ఉంది..! వాడెవడో నా మీద కక్ష తీర్చుకోవడానికి... కావాలనే అలాంటి విషపు ఉత్తరం రాశాడు. చదివి కళ్లుపోయాయి!
‘సార్... అన్నీ అబద్ధాలు సార్! మిమ్మల్ని ఆటపట్టించడానికి అలా చేసుంటాడు చిచ్చర పిడుగు! మీరు టెన్షన్ పడకండి. ఇలా వాలిపొండి. మీ కంటి మీద తొక్క పెట్టి కూలింగ్ ఫీలింగ్ ఇస్తా వెంటనే తగ్గిపోద్ది! కానీ.. ఫస్ట్ టైమ్ మీకు రివర్స్ పడింది. కొత్త ఫీలింగ్ సార్!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com