నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! మీరిచ్చిన ధైర్యానికి చాలా థ్యాంక్స్. నాన్న నాతో మాట్లాడటానికి ముందు అక్కతో మాట్లాడాను. మా ఇంట్లో వాళ్లు తనతో లైఫ్ రిజెక్ట్ చేశారు. మర్చిపో అని చెప్పారు. నెల అయింది సంతోషం కోసం సెర్చ్ చేస్తున్నా, దొరకడం లేదు. చావు ఒక్కటే పరిష్కారం కాదు కదా అని వెయిట్ చేస్తున్నా. నమ్మకాన్ని కోల్పోయాను అన్నయ్యా! తను నాకు ఒక మెయిల్ చేశాడు. మీకు చెప్పుకోవాలి అనిపిస్తుంది అన్నా. దయచేసి చదవండి.
‘‘సారీ రా, నేను జాబ్ వదిలేశాను. నువ్వు లేనప్పుడు ఈ జాబ్ చేసి నేనేమి చేయాలి? నాకు అమ్మ అయినా నాన్న అయినా నువ్వే. హ్యాపీ ఫాదర్స్ డే. ఏదో ఒక రోజు నిజం నీకు తెలుస్తుంది. అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. మీ నాన్నగారు అంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నువ్వు నన్ను, ఆయనను బాధ పెడుతున్నావు. సారీ.. నీ లైఫ్ నీ ఇష్టం. కానీ... నా లైఫ్‌తో ఆడుకున్నావ్. దానికి నాకు సమాధానం కావాలి. నువ్వు ఇవ్వలేదో, వెళ్లి మీ నాన్ననే అడుగుతాను.’’
ఇది అన్నయ్యా... తనని నేను మోసం చేయలేదు. తన జీవితంతో ఆడుకోలేదు. తను నా కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో నేను కూడా అంతలా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారన్నయ్యా? – షాము
నీ అదృష్టం బాగుండి వర్కవుట్ అవ్వలేదు తల్లీ. ‘‘సార్! ఏంటి సార్ లవ్ వర్కవుట్ కాకపోతే. మీరు కాకమీద ఉన్నారు... వెరీ బ్యాడ్... అది కూడా మీ సిస్టర్ లవ్ వర్కవుట్ కాకపోతే ఏంటి సర్ ఈ శాడిజం?’’ వాడు గాన్ కేస్. నా బంగారం లక్కీ. బతికి బయటపడింది. పెళ్లీ గిళ్లీ అయితే లైఫ్ లాంగ్ హ్యాపీ ఫాదర్స్ డే, మదర్స్ డే అని తలకాయ తింటాడు. ‘‘మీరు ఇతరుల లవ్‌ని అరటిపండులా తింటారు... వెరీ బ్యాడ్.’’ అని నా చేతిలోని అరటిపండును లాక్కుంది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com