
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హలో సర్! నా వయసు 21. నేను ఒక కంపెనీలో వర్క్‌చేస్తున్నాను. ఒక అమ్మాయిని చూశాను. అప్పటినుంచి నాకు తనే గుర్తుకు వస్తోంది. ఇది ప్రేమో లేక అట్రాక్షనో తెలియడంలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నా వైపు చూడడం, నవ్వడం చేస్తోంది. మొన్న పండగకి మా ఊరు వచ్చినప్పుడు డేర్ చేసి ఆ అమ్మాయికి చెప్పేశాను. ఇంకా ఫోన్ నంబర్ కూడా ఇచ్చేశాను. తీసుకుంది. కాని ఇంకా రిప్లయ్ రాలేదు. ఏం చేయాలి సర్? – టి. ఆది
దొరికిపోయావు బిడ్డా! ‘ఆది’ లైఫ్‌లో ‘అంతం’ స్టార్ట్ అయ్యింది. హ్యాపీనెస్ అంతం షురూ..! నిమిషానికి ఒకసారి ఫోన్ చూసుకుంటున్నావు. ఫోన్ ట్రింగ్‌మనగానే ఉలిక్కిపడుతున్నావు. ట్రింగ్ ట్రింగ్ అనే లోపలే ఎత్తేస్తున్నావు. నిద్రపొయ్యే ముందు ఫోన్ చూసుకుంటున్నావు. అర్ధరాత్రి లేచి చూసుకుంటున్నావు. కలలో ఫోన్ చూసుకుంటున్నావు. టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ చేసేటప్పుడూ చూసుకుంటున్నావు. ఇలా చూసుకుంటూ చూసుకుంటూ రోడ్డు మీద నడవకు ప్లీజ్. పడతావ్!
ప్రేమలో గుడ్డివాళ్లైపోతారు. నువ్వేంటి బ్రో.. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునేలా ఉన్నావ్. ‘సార్.. గుడ్డోడు ఎలాగో అవుతాడు. ఫోన్ అంతంత సేపు చూస్తే కాడా..?’ అబ్బ నువ్వు ఎంత స్మార్ట్ నీలాంబరీ... వాడి స్మార్ట్ ఫోన్ కంటే స్మార్ట్.. ‘పొండి సర్ మొహమాట పెడుతున్నారు..’ నా మాట విని ఆదీ... కొత్త సిమ్ పెట్టుకో! పాత కనెక్షన్ మరిచిపో! ‘టూ మచ్ సర్! ప్రేమికుడిని అంతగా వేధిస్తారా? ఏదైనా పాజిటివ్‌గా చెప్పొచ్చుగా..!’ లేకపోతే ఏంటి నీలాంబరీ..! నిన్న నంబర్ ఇచ్చాడట.. ఇవ్వాళ కన్ఫర్మేషన్ కావాలంట... నిన్న అరటిపిలక పెట్టి ఇవ్వాళ.. అరటిపండు కావాలన్నట్లు ఉంది కదా సర్.. అయితే ఒక మంచి ప్రేమికుడిని అంత పేషెంట్‌గా ఉండమన్న మీరు కొంచెం పేషెంట్‌గా ఉండండి. టుడే నో అరటిపండు అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com