నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని నాలుగేళ్ల క్రితం ప్రేమించా. ఆమెని ఎంతకీ మరిచిపోలేకపోతున్నా. టూ ఇయర్స్ క్రితం ఆమెకు పెళ్లి అయ్యింది. ఒక పాప కూడా ఉంది. అయితే ఇప్పుడు తను నన్ను మళ్లీ ప్రేమిస్తున్నా అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పెళ్లి అయ్యి పాప కూడా ఉందని ఆలోచిస్తున్నా. ఏం చెయ్యమంటారు సలహా ఇవ్వండి ప్లీజ్!! – చందు
ఎబౌట్ టర్న్ కొట్టు తిరిగి చూడకు నీకు దండం పెడతా నీకు నీలాంబరి తోటలో ఎకరం రాసిస్తా!! ‘సార్.. ఎంత పెద్ద మనసు సార్ మీది’
కదా! అందుకే నీ పొలం రాసిస్తానన్నాను!! ‘యదవది పొలమే కదా... అది కాదులే సార్ చివాట్లు పెట్టకుండా అంత ప్రేమగా అర్థించుకుంటుంటే!! మీది చాలా చాలా పెద్ద మనసు అనిపించింది.’ చందు మంచోడు! తప్పు చెయ్యకుండా మనకు రాశాడంటే... మంచి మనసు ఉన్నవాడు! అలాంటి వాడిని రిక్వెస్ట్ చేసుకోవడమే కరెక్ట్!! ‘మీ మాట వింటాడా సార్?’ ఐయామ్ కాన్ఫిడెంట్!!
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. lovedoctorram@sakshi.com