నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
అందరిలానే నేనూ ఓ అమ్మాయిని లవ్ చేశా. ప్రపోజ్ చేశా. తను ఇప్పుడు మాట్లాడటం లేదు. ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు బాగానే ఉండేది. బట్ ప్రపోజ్ చేసినప్పటి నుంచి నాతో మాట్లాడం లేదు సార్. రీజన్ అడగటానికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. తనని కలిసే వీలు కూడా లేదు. ఏం చెయ్యమంటారు సార్? తన వైఖరికి కారణం ఏమై ఉంటుంది సార్? – రాజు
‘పాపం సార్ ఫ్రెండ్ షిప్‌లో నుంచి దూకి లవ్ షిప్‌లో పడాలనుకున్నాడు!!’ అమ్మాయి చెయ్యి అందించడం లేదు! ‘కొట్టుకుంటున్నాడు సార్!!’ సరిగ్గా ఈత కూడా రాదేమో..! ‘ఫ్రెండ్‌షిప్ ఈత అయితే మేనేజ్ చేసేవాడు సార్!’ లవ్ షిప్ అంటే తుఫాన్‌లో చిక్కుకున్న షిప్ లాంటిది! ‘టైటానిక్ లా మునగాల్సిందేనా సార్?’ మనోడిది టైటానిక్ కూడా కాదు పుట్టి!
‘ఇక తుఫాన్‌కి బోల్తా పడటం ఖాయం సార్! హౌ టు సేవ్ హిమ్!?!’ ప్రేమ మరచిపోతే తుఫాన్ ఆగిపోతుంది! ‘అప్పుడు సింగిల్ హ్యాండ్‌తో పుట్టిని తోసుకుంటూ ల్యాండ్ మీదకు రావచ్చు సార్!’ విషయం ఏంటంటే... ప్రేమించేటప్పుడు కళ్లు నేల మీద ఉండవు. ఫ్యూచర్ ప్లాన్ చేసేటప్పుడయినా మైండ్ ల్యాండ్ మీద ఉంటే మంచిది!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com