
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! ‘అసలు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామా! లేదా!!’ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి సార్!? ప్లీజ్ చెప్పండి సార్?
– గణేష్
డజన్ అరటిపండ్లు తిన్నా ఆకలి తీరదు! ‘ఒక్క అరటిపండు తినక పోయినా ఆకలి ఉండదు’ అని లింకు కలిపింది నీలాంబరి! తొక్క మీద కాలేసినా... ‘జారి వీపు పగిలినా...’ అర్థం కాదు! ‘డిఫరెన్స్ తెలియదు’ తమన్నాను చూసినా... ‘ప్రియాంకాని చూసినా..’ తనే కనబడుతుంది! ‘తనే వినబడుతుంది!’ మహేష్‌ని చూస్తే... నువ్వే కనిపిస్తావు! ‘అర్జున్‌ని చూస్తే... నువ్వే అనిపిస్తావ్...! ఎండ వెన్నెలలాగా... తాటి చెట్టు స్ట్రీట్ లైట్‌లాగా.. తిట్లు బ్లెస్సింగ్స్ లాగా... ‘దెబ్బలు అక్షింతలు లాగా..’ ఇలా అనిపిస్తే...! ‘అలా అనిపిస్తే..?’ లవ్... లవ్... లవ్...! ‘ఆ తరువాత డాక్టర్... డాక్టర్... డాక్టర్...’ అని నవ్వింది నీలాంబరి!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com