
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఏడేళ్లుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను ఇష్టపడింది. నాకు అన్ని రకాలుగా దగ్గరైంది. అది తెలిసి మా పేరెంట్స్ నాకు బలవంతంగా వేరే అమ్మాయితో పెళ్లి చేసేశారు. 2 ఇయర్స్ క్రితమే పెళ్లి జరిగింది. బట్ నా లవర్‌ని మరిచిపోలేకపోతున్నా. తనతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నా. అయితే... ఈ మధ్య తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నా! ఇప్పుడు నేను ఎవరిని వదులుకోవాలి సర్! ప్రేమించిన అమ్మాయినా? పెళ్లి చేసుకున్న అమ్మాయినా? ప్లీజ్ సలహా ఇవ్వండి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? – శివ
నీ మెడలో తాళి చూపించుకుంటూ తిరుగు!‘అదేంటి సార్ అబ్బాయి మెడలో తాళి ఏంటి?’బలవంతంగా పెళ్లి చేశారు కదా!‘అయితే... మగాడు తాళి కట్టించుకుంటాడా సార్?’తల వంచి పెళ్లి చేసి ఉంటారు కదా! ‘పెళ్లికొడుకు తల వంచుతాడా సార్?’ ఇక్కడ సర్కస్ చేస్తూ... అక్కడ పెళ్లి చేసుకుని... మళ్లీ లవర్‌ని వాడుకుంటూ... ఇప్పుడు ఎవరిని వదలాలో మనం చెప్పాలంటే...! ఇద్దరి లైఫ్‌తో గేమ్స్ ఆడుతున్నాడు!‘సార్, చాలా బాధగా ఉందట సార్!’ పిచ్చి వేషాలాపితే బాధ తగ్గుతుంది! బాదుడు కూడా తప్పుతుంది!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com