
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను సిక్స్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచీ నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. నైన్త్ క్లాస్‌లో నేను స్కూల్ మారాను. సో.. నన్ను మరిచిపోతాడేమో అనుకున్నాను. కానీ ఆ నెక్స్ ఇయరే మేము ఇద్దరం ఎఫ్‌బిలో ఫ్రెండ్స్ అయ్యాం. టూ ఇయర్స్ అయినా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. తనంటే నాకు చాలా ఇష్టం కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే... మావి వేరువేరు మతాలు. పైగా మా డాడీకి ఇలాంటివి ఇష్టం ఉండవు. బట్ నాకు తనతోనే జీవించాలని ఉంది. ఏం చెయ్యమంటారు? – నవ్య మానస
సార్.. డజన్ అంటే ఎన్ని? పన్నెండు. ‘హాఫ్ డజన్ ఎంత?’ ఇప్పుడు అరటిపండు లెక్కలెందుకు చెప్పు నీలాంబరీ? m‘చెప్పండి సార్.. చెప్పండి ప్లీజ్!’ ఆరు. ‘ఆరు నూరయినా నేను ఆరో క్లాస్ అబ్బాయినే లవ్ చేస్తానంటోంది నవ్య మానస. ఇప్పుడు ఏమి చెయ్యాలి సార్?’
ఇంకో డజన్ ఇయర్స్ ఆగమని చెప్పాలి ‘సార్ అప్పుడు నవ్య చాలా ఓల్డ్ అయిపోతుందేమో..?’ ఓకే. అయితే, హాఫ్ డజన్ ఇయర్స్ ఆగమని చెప్పు. ‘ఏంటి సార్ అంతా అరటిపండు లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com