నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ రామ్ అన్నయ్యా! ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో. చిన్నప్పుడే అమ్మ, నాన్నలను పోగొట్టుకున్నాను. తోడబుట్టిన అక్కని పోగొట్టుకున్నాను. కానీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తన కూడా నన్ను లవ్ చేసింది. అమ్మాయి పేరెంట్స్‌కి విషయం తెలిసి వేరే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. తనకి అది ఇష్టం లేక ‘నన్ను తీసుకెళ్లి పెళ్లిచేసుకో’ అని అడిగింది. నేను వెంటనే తనను తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నా. 2 ఇయర్స్ గడిచాయి. ఇద్దరం జాబ్ చేసుకునేవాళ్లం. లైఫ్ హ్యాపీగా ఉంది అనుకునే టైమ్‌లో తన బిహేవియర్‌లో ఛేంజెస్ చూశాను. అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆఫీస్‌కి సరిగా వెళ్లడం లేదని తెలిసింది. నాకు ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్పి వెళ్లేది. ఎంక్వైరీ చేస్తే అక్కడ వేరే అబ్బాయితో తిరుగుతోందని తెలిసింది.
నేను ఓ రోజు ఆ విషయాన్ని అడిగాను. నాకు తెలిసిపోయిందని తెలిసి, తను ఆ అబ్బాయితో వెళ్లిపోయింది. అన్నయ్యా, నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలియడం లేదు. అందరినీ పోగొట్టుకున్నా నా లైఫ్ తనే అని బతికాను, ఇలాగ మోసపోయాను. చచ్చిపోవాలని వుందన్నయ్యా. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కూడా తను చేసిన మోసం క్షణక్షణం గుర్తుకొస్తూనే ఉంది. ఏమి చేయాలి? ప్లీజ్ అన్నయ్యా హెల్ప్ మి. ఏదన్నా చెప్పన్నయ్యా. – జశ్వంత్
తమ్ముడూ జశ్వంత్! ఓరి... ఓరి... ఓరి బంగారం కింద పడకూ... కష్టాలు వస్తాయి. భయపడకూ. మనం వీక్ అయితే అందరూ తొక్కేస్తారు.కింద పడకూ. చిన్నప్పట్నుంచీ ఏదో ఒకటి పోగొట్టుకున్నావు కాబట్టి... కాన్ఫిడెన్స్ పోయింది. ఛాతీ విరుచుకుని లేచి హీరోలా నిలబడు.మనలో ఉన్న భయాలను ఒక తన్ను తన్నకపోతే... ఆ భయాలు నిజమయి మనల్ని తన్నుతాయి. గెట్ అప్ అండ్ లవ్ లైఫ్... బంగారం. ‘సార్! జశ్వంత్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. మీకీ రోజు ఒక్క అరటిపండు కాదు గెల మొత్తం ఇచ్చేస్తాను’.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com