
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! నాలుగేళ్ల క్రితం ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. రెండేళ్ల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. నన్ను మాత్రం పిచ్చిదాన్ని చేశాడు. ఇప్పుడు.. మళ్లీ మెసేజ్‌లు చేస్తున్నాడు. ‘నేను హ్యాపీగా లేను, నిన్ను మిస్ చేసుకుని తప్పు చేశా’ అంటున్నాడు. తనని మరిచిపోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను! ప్లీజ్ అన్నయ్యా.. మంచి సలహా ఇవ్వండి. – గీత
ఆ మెసేజ్‌లు తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వు తల్లీ్ల! దుర్మార్గుడు అని తెలిసి ఇంకా తన గురించి ఆలోచించడం రాంగ్! డిస్టర్బ్ ఏంటి? మోసం చేసేవాడితో డిస్టర్బ్ అవడం ఏంటి? నేను ఒప్పుకోను! ‘నేను కూడా ఒప్పుకోను గీతా’ అంది నీలాంబరి!మనం ఇలా వీక్‌గా ఉంటేనే వాడు పెట్రేగిపోతాడు! ‘ఒక్కసారి తిరగబడి క్లాసు పీకితే దెబ్బకు దారికొస్తాడు’ ప్లీజ్ స్టాప్ బీయింగ్ వీక్!‘అస్సలు డౌన్ కావద్దు. బలంగా ఉండు, మంచి రోజులు ముందు ఉన్నాయి’ యు ఆర్ రైట్ నీలాంబరి! మెచ్చుకోలుగా అరటిపండు అందించింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com