
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! ఓ అబ్బాయి, నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఒకరికొకరం చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని మా అమ్మకి చెబితే.. మా నేపథ్యాలు వేరుకావడంతో ఒప్పుకోలేదు. వేరు అబ్బాయితో ఎంగేజ్‌మెంట్ చేసింది. విషయం తెలుసుకున్న తను.. నేను లేకపోతే తట్టుకోలేనంటున్నాడు. లైఫ్ లాంగ్ ఎలాగైనా నాతో మాట్లాడుతూ ఉండు చాలు... అంటున్నాడు. కనీసం ఫ్రెండ్‌లా అయినా ఉండాలనిపిస్తోంది. ఏం చెయ్యమంటారు? సలహా ఇవ్వండి అన్నయ్యా! – మౌని
వద్దు! ‘ఎందుకు వద్దు సార్..?’ వద్దు అంతే..! ‘ఫోర్ ఇయర్స్ లవ్ సార్!’ అయినా వద్దు! ‘ఏంటి సార్ ఇతరుల జీవితాలను శాసించే రైట్ మీకు ఎవరిచ్చారు..?’ ఏమయినా అనుకో... వద్దనే వద్దు! ‘మీరు అరటిపండు అడగండి అప్పుడు చెబుతా!’ ఏం చెబుతావు...? ‘వద్దు... అని చెబుతా..!’ ఆకలితో జీవితం తొక్క అయినా ఓకే కానీ, మౌనీ! సారీ... ఆ అబ్బాయితో వద్దే వద్దు. ‘ఎందుకు సార్’ ఒక్కోసారి విధి ఆడిన ఆటకు తల వంచక తప్పదు. ‘ఇట్ మేక్స్ నో సెన్స్...’ కావాలంటే అమ్మను కన్విన్స్ చెయ్యి... కుదరకపోతే ఫర్గెట్ హిమ్. ‘యూ ఫర్గెట్ అరటిపండు’.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com