నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
గుడ్ ఈవెనింగ్ సర్, అయామ్ ఫ్రమ్ నల్గొండ. మై ప్రాబ్లమ్ ఎబౌట్ మై మదరలు అండ్ మామ. ప్లీజ్ గివ్ మి సొల్యూషన్. నా మేనమామకి ఇద్దరు డాటర్స్. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్. ఫస్ట్ వన్ మ్యారీడ్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ బై ఎ బ్రాహ్మిన్. వి ఆర్ విశ్వబ్రాహ్మిన్స్. నౌ సెకండ్ డాటర్ ప్రపోజ్డ్ అనదర్ క్యాస్ట్ పర్సన్. నౌ మై మామ నాట్ యాక్సెప్టెడ్ దిస్ మ్యాచ్. నా మరదలు విల్ మ్యారీ హిమ్ ఓన్లీ. మ్యారేజ్ చెయ్యకుంటే సూసైడ్ చేసుకుంటా అంటోంది. మ్యారేజ్ చేస్తే నా పరువు పోతుంది అని నా మామ... ఇద్దరూ – మ్యారేజ్ చెయ్యలేని వెధవ అంటారు. ప్లీజ్ గివ్ మి సొల్యూషన్. యాక్చువల్లీ నా సెకండ్ మరదలు డెలివరీ టైంలో అత్తయ్య ఎక్స్‌పైర్డ్. టిల్ నౌ మామ డజ్‌నాట్ మ్యారీ. íహీ శాక్రిఫైసెస్ హిస్ లైఫ్. బట్ నౌ వీళ్లు ఇలా చెయ్యడం తట్టుకోలేకపోతున్నాడు. – శ్రీనివాస్
అన్నా కులం కుటుంబం లాంటిది. దానికి పరిధులు ఉంటాయి. ఆ లిమిటేషన్స్‌ను అర్థం చేసుకోవాలి. దాన్ని గౌరవించాలి. మనసు యూనివర్స్ లాంటిది. లిమిట్లెస్.. బండ్లెస్...! దాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. వీలయితే మామకు చెప్పు. మరదలు మీద నీకు ఇంటరెస్ట్ ఉంటే మరదలుకు చెప్పు. ‘‘సార్... అన్యాయం సార్... పాపం మామయ్యకు హెల్ప్ చేద్దామనుకుంటుంటే.. పెడర్థాలు... మీనింగ్‌లెస్ కనెక్షన్లు పెడుతున్నారు. ఐ యామ్ వెరీ హర్టెడ్... సార్... మీరు కూడా ఇంత చీప్‌గా ఆలోచిస్తారా?’’
ఏదో ఇంట్రస్ట్ ఉన్నట్టు అనిపించింది. మామ మీద ప్రేమ ఉంటే... ఒక డజన్ అరటిపండ్లు ఇచ్చి ఊరుకుంటారు కదా? మరదలు ఎవరినో ఇష్టపడుతుంటే తొక్కలా ఫీలైపోతున్నాడు. అని నేను అలా ఫీల్ అయిపోయా... సారీ నీలాంబరీ. నన్ను క్షమించు. అపార్థం చేసుకోకు. ‘‘ఓకే... ఓకే... నేను శ్రీనివాస్‌కి చెబుతాలే – ఇంట్రస్ట్ ఉంటే డైరెక్ట్‌గా లవ్ డాక్టర్‌కి రాయమని!’’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com