నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ గురువుగారు!! నాలుగు నెలల క్రితం ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. నేను ఓకే చెప్పాను. లవ్‌లో పడిన రెండోరోజునే తను నాకు ఫోన్ చేసి ‘‘బంగారు, నేను నిన్ను ప్రేమించి రెండు రోజులే అవుతోంది కానీ, నువ్వు లేకుండా నేను ఉండలేను రా! నిన్ను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేను రా’’ అని చెప్పింది! ఆ క్షణమే నిర్ణయించుకున్నా తనే నా ప్రాణమని! అయితే, చాలారోజులుగా నన్ను ఇంకో అమ్మాయి(నా క్లాస్‌మేట్) లవ్ చేస్తోంది. నేను ఇగ్నోర్ చేశాను. కానీ ఒకరోజు ఆ అమ్మాయి నా కోసం హైదరాబాద్ వచ్చింది. నాకు ఏం చెయ్యాలో తెలియక నా బంగారానికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు తన సాయం కోరాను.
(మా క్లాస్‌మేట్‌ని తిరిగి ఇంటికి పంపించేస్తా.. ఒకవేళ వెళ్లనని మొండికేస్తే ఈ ఒక్క నైట్‌కి మీ ఇంట్లో ఉంచుకుంటావా బంగారం అని అడిగాను.) ఓకే అంది. ఆ రోజు నైట్ అంతా బాగానే మాట్లాడింది. కానీ, మరునాడు ఫోన్ చేసి ‘‘నేను నైట్ అంతా బాగా ఆలోచించా.. నేను నీకు కరెక్ట్ కాదు రా! నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసి ఉండకపోతే... తను నీకోసం ఇంత దూరం ఎందుకు వస్తుంది? తనే నీకు కరెక్ట్, నాకు ఇంక ఫోన్ చెయ్యకు! మెసేజ్ చెయ్యకు!!’’ అని ఫోన్ పెట్టేసింది. తను మాట్లాడక 30 డేస్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఏం తినడం లేదు. తనని మర్చిపోలేకపోతున్నా. నిజానికి మా క్లాస్‌మేట్ విషయం తనకి చెప్పకుండానే ఉండేవాడిని కానీ, భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకూడదని, అర్థం చేసుకుంటుందని నమ్మి చెప్పాను. ఇలా అవుతుందనుకోలేదు!! ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – విక్రమ్
నీలాంబరీ, ఏమంటావ్? ‘సార్ అంతా నాటకం సార్!! పోజులు కొట్టాడు. అసలు ఇంకో అమ్మాయి లేదు సర్. బిల్డప్ ఇచ్చి తను ఎంత గ్రేటో.. అమ్మాయిలు తనకోసం ఎంతగా రెచ్చిపోతున్నారో చెబితే ఈ అమ్మాయి ఇంకా అతుక్కుపోతుందని అనుకున్నాడు.’ చటుక్కున ఊడిపోయింది ఇప్పుడు క్యా కర్నా!? ‘మీరే చెప్పండి సర్ డిస్ట్రబ్ అవుతాడేమో!! కొంచెం కైండ్‌గా చెప్పండి సర్!!’30 డేస్ నుంచి ఏమి తినలేదు. ముందు ఒక అరటిపండు తిను! ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌తో సెకెండ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేయించు! ‘ఏం చెబుతుంది సార్... ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ సెకెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తో...?’ నేను తనని ప్రేమించాను కానీ, తను నిన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పిస్తే వర్క్‌అవుట్ అవుతుంది!!
‘సార్... చెప్పిస్తే...??’ నేను సిన్సియర్‌గా ఆన్సర్ చెబుతుంటే నువ్వు అరటిపండులో తొక్క అడ్డం వేస్తున్నావు!! ‘ఐ మీన్ చెప్పిస్తే...? అంటే స్లిప్పర్‡లాంటివి ఏవైనా ఇస్తే.... ఫీల్ అవుతాడేమో సార్ అని’ హో!! యు మీన్ చెప్పిస్తే...! అలా జరగదు!! మనోడు చాలా సిన్సియర్!! ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ అర్థం చేసుకుని సెకెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ని కన్విన్స్ చేస్తుంది. అంతా హ్యాపీస్!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com