నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని లవ్‌చేస్తున్నా. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలియడం లేదు. కానీ నా వైపు బాగానే చూస్తుంది. తనకు ఆల్‌రెడీ లవర్ ఉన్నాడు. తను ఇప్పుడు మా విలేజ్ నుంచి చాలా దూరంలో జాబ్ చేస్తోంది. నేను తనని చూడకుండా ఉండలేను. ఆ అమ్మాయిని మరిచిపోలేకపోతున్నా. తనని మరిచి పోవాలంటే ఏం చెయ్యాలి సార్! – ప్రేమ్‌కుమార్ డోలా
పడమరకు తిరిగి 5:45 పిఎమ్ నుంచి 7:45 పిఎమ్ దాకా సింగిల్ లెగ్.. ‘ఏ లెగ్ సార్..?’ లెఫ్ట్ లెగ్ మీద నిలబడి... ‘నిలబడి..’ చేతిలో చెంబు తీసుకుని... ‘ఏ చెంబు సార్..?’ ఇత్తడి చెంబుతో దే తడి... ‘పోచమ్మ గుడి దగ్గరా సార్..?’ వన్ డ్రాప్ ఎట్ ఎ టైమ్ డ్రాప్ చేస్తూ... ‘చేస్తూ...?’ ఈ మంత్రం పఠించాలి! ‘వాట్ మంత్రం సార్.. టెన్షన్‌తో చచ్చిపోతున్నా..’ డోలా డోలా దిల్ జర జరా.. మరచిపోత నిన్ను జర జరా.. జాగు మాని లవ్ వదలరా.. ఇత్తడి చెంబుతో జలజల.. మరచిపొమ్మన్నాడు లవ్ డాక్టరా... ‘సార్ సూపర్ సార్ పోకిరి సినిమాలో ట్యూన్‌తో మంత్రం! ఎంజాయ్ ప్రేమ్ కుమార్ డోలా!!’ మనం ఇక అరటిపండు తింటే పోలా...!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com