నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నా పేరు పొట్టోడు. నా లవ్ పేరు పొట్టి. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వన్ వీక్ నుంచి పొట్టి నన్ను ఎందుకో అసహ్యించుకుంటోంది. నేనేం తప్పు చెయ్యలేదు సర్!! చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది. నేను ఏం చేస్తే నా పొట్టి మళ్లీ నాతో మాట్లాడుతుంది సార్? సొల్యూషన్ చెప్పండి ప్లీజ్!! – యశ్వంత్
పొట్ట చిరిగిపోతుంది!! పొట్టా పొట్టి చేసుకున్నారు కట్టి! ‘‘కట్టి అంటే ఏంటి సార్’’ ‘‘కట్టి అంటే కటీఫ్!!’’ ‘‘కటీఫ్ అంటే?’’ ‘‘పొట్టోడు అర్థం చేసుకుంటాడులే...’’ ‘‘నాకు తెలియాలి.. ఐ వాంట్ టు నో.. నా మానాన నేను పండిన అరటిపండు తింటుంటే పొట్టా.. పొట్టీ.. కట్టీ.. కట్టీఫ్ అంటూ.. బట్టీ కొడుతుంటే.. ఎలా? హౌ..? నాకు తెలియాలి!!’’ ‘‘కటీఫ్ అంటే చిన్న ఫైట్‌తో అమ్మాయి గుడ్ బై చెప్పిందన్నమాట!! ‘‘మరి ఫిటీఫ్ ఎలా చెయ్యాలి సార్?’’ ‘‘ఫిటీఫ్ అంటే...’’ ‘‘ఆపోజిట్ ఆఫ్ కటీఫ్..’’ ‘‘వెరీ ఈజీ ఓ గెల అరటిపండ్లు తట్టిలో తీసుకెళితే కటీఫ్ ఫిటీఫ్ హోజాతా!!’’ ‘‘తట్టీ అంటే..’’ ‘‘గంప.. గంపెడు ఆశలకు అరటి గంప...!’’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటేప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com