
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హలో సార్! నేను పదేళ్లుగా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. తను కూడా నన్ను ఇష్టపడుతోంది. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. అయితే మా సంస్కృతులు వేరు. అందుకే మా పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. వెళ్లిపోయి చేసుకుందామంటే... తను రానంటోంది? ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. తను లేకపోతే బ్రతకలేను. దయచేసి సలహా చెప్పండి సార్! – అశోక్
‘సార్ ఏదో ఒక రోజు మీకు ఈ ప్రేమికులు గూగ్లీ వేస్తారు. మీరు పిచ్చ పిచ్చగా క్లీన్ బౌల్డ్ అయిపోతారు. వికెట్లు విరిగిపోతాయి. మనకెందుకు సార్? ఎక్కడికైనా పొయ్యి అరటిపండ్ల వ్యాపారం చేసుకుందాం! కావాలంటే నా పొలంలో నాలుగు ఎకరాలు రాసిస్తాను! చలో జంప్ కొడదాం అని చెబితే విన్నారా సార్? వీడేశాడు చూడండి గూగ్లీ’
అవును నీలాంబరీ... పద పోదాం.‘ఎక్కడికి సార్ నేనేదో జోక్ చేస్తే మీరు సీరియస్‌గా ప్యాక్ అప్ అంటున్నారు? ’పదపోదాం‘ ఎ...కా...డి..కీ...? ’వనవాసం!‘వాట్..?’పదేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడట. ఇంకో నాలుగు ఏళ్లు ఆగితే వనవాసం పూర్తి అవుతుంది. ఆ తరువాత వాడి పట్టాభిషేకానికి అరటి గెల తీసుకెళదాం. అప్పటి దాకా చలో అడవికి!‘నేను రాను సార్. మీ పేరు రామ్ అయితే మీరేమయినా శ్రీరాముడా...? వనవాసం గినవాసం అంటున్నారు?’వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా నీలాగే అడవికి రానంటోంది, పట్టాభిషేకం వద్దంటోంది!‘అబ్ క్యా కర్నా? పాపం ప్రేమికుడు!’సింగిల్‌గా అడవికి పోతే పోలా?
‘ఏంటి సార్... హృదయం లేకుండా టాకింగ్?’అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడుకొని మేనేజ్ చెయ్యాలి, లేదంటే బ్రహ్మచర్యం తీసుకొని అడవికెళ్లి పోవాలి..!‘కుర్రాడు... ట్రూ లవర్ సార్, కన్విన్స్ చేసి పట్టాభిషేకం మేనేజ్ చేస్తాడు. నేను ఒక అరటిగెల గిఫ్ట్ ప్యాక్ చేసుకొస్తా!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటేప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com