
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్ సర్! మూడేళ్ల క్రితం ట్రైన్ జర్నీలో ఒక అబ్బాయితో పరిచయం అయ్యింది. మేము చాలా త్వరగా ఫ్రెండ్స్ అయిపోయాం. ఒన్ ఇయర్ తరువాత ప్రపోజ్ చేశాడు. తన మీద ఉన్న నమ్మకంతో ఓకే చెప్పాను. కానీ మా కులాలు వేరు. సెటిల్ అయిన తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఒక రోజు మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసిపోయి పెద్ద గొడవ అయింది. ఆ అమ్మాయితో మాట్లాడొద్దని వాళ్ల ఇంట్లో మాట తీసుకున్న కారణంగా 6 నెలల పాటూ నాతో మాట్లాడం మానేశాడు.
తరువాత మళ్ళీ దగ్గరయ్యాడు. ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉన్నాం. కానీ ఇంతకుముందులానే మళ్లీ చేస్తాడేమో అనే భయం వెంటాడుతోంది. తను మాత్రం మరోసారి ఇలా చెయ్యనని నాకు మాట ఇచ్చాడు. ఇంకా విషయం మా ఇంట్లో తెలీదు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నా స్టోరీలో నేను చేసిన తప్పేమైనా ఉందా? చెప్పండి సర్. – రాణి
బంగారు తల్లీ! ఎవరూ చెడ్డ వాళ్ళు కారు. పరిస్థితులు మనుషులను మారుస్తాయి. మళ్ళీ బలం పుంజుకున్నప్పుడు తప్పును అర్థం చేసుకుంటారు. తల్లితండ్రుల ప్రెజర్‌తో ముందు వద్దన్నాడు మళ్ళీ నువ్వు ఎంత బాధపడుతున్నావో అని దగ్గర అయ్యాడు... రెండు ఇన్సిడెంట్స్ ప్రెజర్ వల్ల జరిగాయి. ప్రేమ వల్ల మారాడా... ప్రెజర్ వల్ల మారాడా... నువ్వు అర్థం చేసుకుంటే బెటర్. ఇంత దూరం వచ్చాక అమ్మానాన్నల సలహా కూడా అవసరం. ఇంకా డిలే చేయొద్దు. మమ్మీ డాడీలతో వెంటనే మాట్లాడు.
ఆల్ ది బెస్ట్. ఏమంటావు నీలాంబరీ? ‘ప్రేమికులు ఎంత డిప్రెషన్‌లో ఉండి రాస్తారో అర్థం చేసుకోమని ప్రవీణ్ అనే ఒక జెంటిల్‌మెన్ మీకు క్లాస్ పీకాడు సర్’. అందుకే ఇవ్వాళ తిక్క ఆన్సర్ ఇవ్వకుండా స్ట్రెయిట్ ఆన్సర్ ఇచ్చినట్టు ఉన్నారు.’ ‘అడగొద్దు ప్లీజ్ అన్నా అడుగుతారు. సరదాగా రాస్తే ప్రవీణ్‌కి కోపమ్. సీరియస్‌గా రాస్తే రీడర్‌కు ‘బోర్’డమ్. అసలు సరదాగా చెబితేనే సీరియస్ ఎక్కుతుంది. ‘తోలు తీస్తేనే అరటిపండు తినగలిగినట్లు’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com