నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
సర్.. నా పేరు మీరా. నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. నేను నో చెప్పాను. బట్ మంచి ఫ్రెండ్స్‌గా ఉందామని చెప్పాను. తను మాత్రం తన లవ్‌ని ఒప్పుకోవాలని ఫోర్స్ చేస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ప్లీజ్ సలహా ఇవ్వండి. – మీరా కపూర్
‘సార్ ఇవాళ అరటిపండు లేదు’ వై? ‘మార్కెట్‌లో లేవు’ మీ తోటలో లేవా? ‘ట్రాన్స్‌పోర్ట్ లేదు’ లారీలు స్ట్రైకా..? ‘సీజన్ అయిపోవస్తోంది కదా, మళ్లీ దొరకవని లారీలన్నీ మామిడి పండ్లు తోలుతున్నాయి సార్’ ఆటో లేదా? ‘లారీలు, బస్సులు, ఆటోలు, రిక్షాలు, సైకిళ్లు అంతా... మ్యాంగో.. మ్యాంగో.. అని డ్యూయెట్లు పాడుకుంటూ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి’ ఒక గెల నువ్వు తేవచ్చు కదా..?
‘కుదరదు సార్. మీరు తినరు, నన్ను తిననివ్వరు.
నాకొక మ్యాంగో కావాలిగా..’ శంకర్ సినిమాలో ‘నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలిగా..’ అన్నట్లు ఏంటా పాట. ఏంటా డాన్స్.‘నాకు మామిడి పండు కావాలి’ ‘ఓకే అయితే మీరు అరటిపండు తెచ్చుకొని తినండి. నేను మామిడి పండు తెచ్చుకున్నాను... తింటాను.’ అదీ విషయం మీరా బంగారం. వాడ్ని లవ్ తెచ్చుకుని ఏమయినా కర్నే దో. నువ్వు మాత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్ మీదే ఉండు.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com