
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. తనకి నా ప్రేమ చెప్పాను కానీ... ఆ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. తనకి నేనంటే ఇష్టమో! కోపమో! చెప్పడం లేదు. కానీ, నేను ఇంకో అమ్మాయితో మాట్లాడితే మాత్రం కోపంగా చూస్తుంది. దయచేసి తన మనసు ఎలా తెలుసుకోవాలో చెప్పండి అన్నా! – వీరబాబు
‘వెరీ బిగ్ ప్రాబ్లమ్.. ఎలా తెలియాలి సార్.. అమ్మాయికి లవ్ ఉందా? హేట్ ఉందా? లేదా... హేట్ లాంటి లవ్ ఉందా? లేక... లవ్‌లో హేట్ ఉందా..?’ చాలా సింపుల్! ‘ఎలా సార్ అంత సింపుల్! ఇది ప్రేమ వ్యవహారం.. నాట్ ఈజీ!’ తొక్కలో అరటిపండు ఉన్నంత సింపుల్! ‘టెల్ మీ... టెల్ మీ ఐ సే!’ అసహ్యంగా చూస్తే కోపంగా చూసిందనుకుంటున్నాడు! ‘పొండి సార్... ప్రేమ ఉంది కాబట్టే కోపంగా చూసింది.’ అరటిపండు అనుకుని తొక్క తిన్నట్లుగా ఉంది నీ పోలిక! ‘లవ్ ప్రాబ్లమ్‌తో మీకు రాస్తే మీరు పెట్టే గడ్డి కంటే... ఆ తొక్కే నయం సార్’ అని నవ్వింది నీలాంబరి!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటేప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com