నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! డెయిలీ నేను లవ్ డాక్టర్ చదువుతున్నాను. అసలు లవ్ చెయ్యడం అవసరం అంటారా? హాయ్‌గా చదువుకోవడం మానేసి ఎందుకు ఇదంతా చెప్పండి అన్నయ్యా మీ మాటల్లో! ఈ చెల్లెలి కోసం!! – ప్రణీత
అసలు లవ్ డాక్టర్ అనవసరం చెల్లి... ‘‘ఏంటి సార్ పోకింగ్ యువర్ ఐ విత్ యువర్ ఓన్ ఫింగర్...’’ ‘‘నీలాంబరీ, మనం తినేది అరటిపండు. ఆపిల్ కాదు... కొంచెం తెలుగులో స్పీకు ప్లీజ్!’’ ‘‘లవ్ డాక్టర్ అవసరం లేదు అంటే ఎలా సార్? దుకాణం బంద్ చేసుకుంటే ఏమి తింటాము..?’’ ‘‘డాక్టరా పాడా ఈ మోసం నేను కంటిన్యూ చెయ్యలేను!!’’ ‘ఏంటి సార్ సడన్‌గా ఈ బిహేవియర్..’ అంటూ నా పల్స్ చెక్ చేసింది నీలాంబరి!! ‘‘సార్ మండిపోతోంది జ్వరం.. కాలిపోతోంది ఒళ్లు.. ఉడికిపోయింది బ్రెయిన్..’’
‘‘ఎవరో ఎవరినో ప్రేమిస్తే దాన్ని మనం బిజినెస్ చేసుకోవడం ఏంటి నీలాంబరి!!’’ ‘‘ఏంటి సార్ సన్యాసుల్లా మాట్లాడుతున్నారు ఆగండి... అరటిపండు జ్యూస్ తెస్తాను’’ అని పరుగెత్తింది నీలాంబరి!! ‘‘చూశావా చెల్లీ!! ఇదీ లొల్లి. ఒకరి ప్రేమ ఇంకొకరికి చులకన! ఒకరి బాధ మరొకరికి పలచన!! లవ్ అంతా మోస్ట్‌లీ పెంటే. వితౌట్ పెంట లవ్ అంటూ చెయ్యాలంటే కెరియర్‌ను లవ్ చెయ్యి! తప్పకుండా నిన్ను కెరియర్ లవ్ చేస్తుంది. ఈ ఆన్సర్ అందరికీ చూపించు. అప్పుడు కానీ నీలాంబరి తిక్క తీరదు. తిక్కోళ్ల లెక్క మీరదు. ఓకే నా!?’’
-ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com