
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్ సర్, నా వయస్సు ఇరవై ఒకటి. నాకు మా ఇంటి పక్క అమ్మాయంటే చాలా ఇష్టం. మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం. మూడు నెలల తరువాత బ్రేకప్ చెప్పింది. ఎందుకు అని అడిగితే... ‘నాకు మా పేరెంట్స్‌ని మోసం చెయ్యడం ఇష్టం లేదు’ అంది. ‘కావాలంటే సిస్టర్‌గా కంటిన్యూ అవుతాను’ అంది. నేను తట్టుకోలేకపోతున్నా, తను అలా ఉంటే నాకు చనిపోవాలనిపిస్తోంది సర్. – భాస్కర్ రెడ్డి
‘అమ్మా తల్లీ! ఒక అరటిపండు ధర్మం చెయ్యి తల్లీ!’ ‘అమ్మా చెల్లీ... అర అరటి పండు ధర్మం చెయ్యి తల్లో..!’ ‘ఏంటి సార్ ఇలా రోడ్ మీద పడ్డారు’ ‘హూ ఆర్ యూ..?’ ‘నేను సార్ నీలాంబరిని’ ‘హూ యామ్ ఐ..?’ ‘మహేష్ బాబు పాటలు వద్దు సర్... మీరు లవ్ డాక్టర్ రామ్ఃసాక్షి.కామ్ సార్’ ‘అమ్మా తల్లీ... ఒక అరటిపండు ధర్మం చెయ్యి తల్లీ!’ ‘అమ్మా చెల్లీ... అర అరటి పండు ధర్మం చెయ్యి తల్లో..!’ ‘ఏంటి సార్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు...? ప్రిస్టేజ్ ఏం కాను..?’ ‘నీలాంబరీ... నీ నర్సింగ్, నా డాక్టరేట్ అన్నీ మరిచిపో. నా వల్ల కాదు. లవ్ చేసి... ఆ తరువాత... ‘సిస్టర్ అనుకో’ అందట ఆ మహాతల్లి. వాడు టెన్షన్‌తో చస్తున్నాడు. నేను ఆన్సర్ ఇవ్వలేక చస్తున్నాను’.‘సార్, అలా అని బంగారం లాంటి ప్రాక్టీస్‌ని తొక్కలో వేసి బిచ్చగాడిలా తిరుగుతారా?’
‘ప్రాక్టీస్ లేకపోతే ఇంక అరటిపళ్లు ఎలా దొరుకుతాయి..?’ ‘నేను ఉన్నాను కదా సార్..!’ ‘నర్స్‌ని సిస్టర్ అంటారు చూడు... ఆ సిస్టర్ కాదంట... ఒరిజినల్ సిస్టర్ అంటోందా అమ్మాయి. అమ్మా తల్లీ... ఒక అరటి’.... ‘ఛీ ఆపండి సార్. మీరు మరీను, మైండ్ డైవర్ట్ చేసుకోవాలి సార్. టెన్షన్ తగ్గిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది.’ ‘అబ్బ, ఆ విషయం ఆ భాస్కర్ రెడ్డికి చెప్పుకో, నాకు అరటిపండు ఇచ్చుకో’.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com