నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
అన్నయ్యా, నేను, మహేశ్వరి అనే అమ్మాయి ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నాం. మా పెద్దల్ని పెళ్లికి ఒప్పించాం. కాని అయామ్ అన్‌లక్కీ. తను బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయింది. తనని మరచిపోయి లైఫ్ మళ్లీ కొత్తగా స్టార్ట్ చేశా. లాస్ట్ మంత్ నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. తనని చూడగానే నాకు మహేశ్వరే గుర్తుకొస్తోంది. తనని మరచిపోలేక పోతున్నా. ప్లీజ్ అడ్వైజ్ ఇవ్వండి. – విశ్వనాథ్
విశ్వనాథ్ నాకు చాలామంది చాలా ఉత్తరాలు రాస్తుంటారు. నేనిచ్చే సమాధానాలు ఎంత తిక్కగా ఉంటాయో అంతకంటే అల్లరి ఉత్తరాలు రాస్తారు. ప్రతి లవ్ స్టోరీని కొంచెం అనుమానంగానే చూస్తాను. ఎందుకో నిన్ను నమ్మబుద్ధి వేస్తోంది. ఐ హోప్ యూ ఆర్ టెల్లింగ్ ది ట్రూత్.
మహేశ్వరి వెళ్లిపోయింది. నువ్వు ఉండిపోయావు. నాకు ఎంతో నచ్చిన ఎంతోమంది వెళ్లిపోయారు. నేను నిజంగానే మంచి స్నేహితుడినయితే నేనింకా ఇక్కడే ఎందుకు ఉండిపోయాను అనిపిస్తుంది. కానీ ఉన్నాను. ఉండిపోయాను. సంతోషంగానే ఉన్నాను. అలా అని నా స్నేహితులను, ఆప్తులను మరచిపోయానన్నది నిజం కాదు.
మనుషులం.. బాధ తొలిచేస్తుంది... ఆ తరువాత జీవితం నడిపించేస్తుంది. నువ్వు నడిచేసేయి. బ్రతికేసేయి. స్మృతుల వనం నుంచి నాలుగు పూలు తెంచి నీ కొత్త స్నేహితురాలికి ఇచ్చేసెయ్. ‘సార్ ఎమోషన్‌తో అరటిగెల మీద కొట్టారు సారూ... మీరు అంతగా ఫీల్ అవకండి... ఆగండి. మీకు ఒక మంచి బనానా స్మూతీ చేసుకొస్తా’ అంటూ వెళ్లింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. lovedoctorram@sakshi.com