
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నా వయస్సు 24. వన్ ఇయర్ నుంచి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. రోజూ తనని ఫాలో అవుతున్నాను. రీసెంట్‌గా తనకి ప్రపోజ్ కూడా చేశాను. అయితే ఆమె.. తనకు తన ఫ్యామిలీ చాలా ముఖ్యమని చెప్పింది. నేను తనను ఫాలో చేస్తున్న విషయం తెలుసని చాలా ఈజీగా నవ్వుతూ చెప్పింది! కానీ, నన్ను రిజెక్ట్ చేశానని చెప్పలేదు. లవ్ చేస్తున్నానని చెప్పలేదు. చివరిగా నవ్వుతూ బస్సులో వెళ్లిపోయింది. సలహా చెప్పండి. – కార్తీక్ తేజ
భాగ్ మిల్కా భాగ్ సినిమా చూడలేదేంటి..? పరుగు తీయ్యి... బస్సు వెనక పరుగు తియ్యి... లేదంటే గుర్రాన్ని రెంటుకు తెచ్చుకో... దానికి బాగా అరటి పండ్లు పెట్టు... ఎస్... బాగా తినబెట్టి... ‘ఒక సవారీ నేర్పరిని అపాయింట్ చెయ్యి...’ అబ్బా... భలే ఫ్లోలో ఉన్నావు నీలూ...! ‘లవ్ డాక్టర్‌కి ప్రియమైన నర్సా మజాకా...’ సిక్స్ మంత్స్ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకో...! ‘అప్పుడు మగధీరలో రామ్ చరణ్‌లాగ టిక్ టాక్ టిక్ టాక్ అంటూ బస్సును ఫాలో కా...’ అమ్మాయి దుపట్టా వచ్చి నీ మీద పడుతుంది! ‘కళ్లు కనబడవు’ ప్రేమ గుడ్డిదని తెలిసిపోతుంది!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com