
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! టెన్త్ క్లాస్ చదువుతున్నా. ఏడాది క్రితం ఒక అమ్మాయి (మా జూనియర్) ట్రాన్స్‌ఫర్ అయ్యి మా స్కూల్‌కి వచ్చింది. అలా వచ్చిందో లేదో నేను లైనెయ్యడం స్టార్ట్ చేశా. అలా 3 మంత్స్ బాగానే గడిచాయి. తరువాత ఆ అమ్మాయి క్లాస్‌మేట్ ఒకడు వచ్చి ‘బ్రో... నేను ఆ అమ్మాయికి ట్రై చేస్తున్నా... నువ్వు డ్రాప్ అవ్వు’ అన్నాడు. నేను నో అన్నా. కానీ, తరువాత ఇంకో అమ్మాయి కనిపించింది.
తను ముందు అమ్మాయి కన్నా సూపర్‌గా ఉంది. దాంతో నేను రెండో అమ్మాయికి ట్రై చేశా. ఈ సమయంలో మొదటి అమ్మాయిని మా జూనియర్ లైన్‌లో పెట్టాడు. అయితే ఎగ్జామ్స్‌లో మార్కులు చూసుకున్నాక అమ్మాయిలు వద్దు ఏం వద్దు... అని నిర్ణయించుకున్నా. కానీ ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి బాగా గుర్తొస్తోంది. మరిచిపోలేక పోతున్నా. దాంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నా. దయచేసి సలహా ఇవ్వండి. – విజయ్
‘సార్ ఈ లెటర్ మీరు చదవకండి’ ఓకే. ‘అవును సార్ మీకు అనవసరంగా కోపం వస్తుంది సార్’ ఓకే. ‘ఆ కోపంలో... పాపం... యంగ్‌స్టర్స్‌కి క్లాస్ పీకుతారు’ ఓకే. ‘నిజం సార్... ఇప్పటిదాకా వచ్చిన మెయిల్స్‌లో... వరస్ట్ క్యాండిడేట్ సార్’ ఓకే. ‘ఇద్దరిని లైన్‌లో పెట్టబోయి... పరీక్షల్లో ఒక్క లైన్ కూడా రాయలేదు సార్’ ఓకే. ‘ఏంటి సార్... ఓకే ఓకే... అంటారు! కొంచెం హెల్ప్ చేయొచ్చుగా..?’ఇలా లైన్‌లో పెట్టేవాళ్లు... లైన్‌గా... లవ్‌లో లైఫ్lలో ఫెయిల్ అవుతారని... నువ్వే చెప్పు. ‘ఓకే సార్!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com