నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. కానీ నాకు భయం వేసి ప్రపోజ్ చెయ్యలేకపోయాను. కొన్ని నెలలకి చెన్నై నుంచి బెంగుళూర్ వచ్చి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను. తరువాత ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తోందని తెలిసింది. సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ మా కంపెనీలో జాయిన్ అయ్యారు. పైగా ఆ అమ్మాయి నన్ను అన్నయ్యా అని పిలుస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. తనని నేను లవ్ చేశానని తెలిసి కూడా తను ఎందుకు అలా పిలుస్తుందో నాకు అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి ప్లీజ్!! – వాసు
‘దొరికిపోయారు సార్!’ ఏమిటో... నీ ఆనందం భరించలేకపోతున్నాను నీలాంబరి!! ‘మీకు పడాలి సార్!’ ఏంటి పడేది? చిక్కులు పడాలి సార్! పడితే కానీ, మీకు ప్రేమంటే ఏంటో తెలియదు!!’ తెలుసుకొని నేనేం చెయ్యాలి? ‘ప్రేమ తెలియకుండా లవ్ డాక్టర్‌గా చలామణి అవ్వడం వెరీ బ్యాడ్’ ప్రేమ తెలిస్తే సబ్జెక్టివ్ ఆన్సర్లు ఇస్తాం, తెలియకపోతే ఆబ్జెక్టివ్ ఆన్సర్లు ఇస్తాం! తెలియక పోవడమే బెటర్!!
‘సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అని ఇంగ్లీష్ మాటలు చెప్పి కన్‌ఫ్యూజ్ చెయ్యకండి. ‘వాసుకి’ ఆన్సర్ చెప్పండి!’ ప్రేమించిన అమ్మాయి... అన్నా అని పిలుస్తుంది. ‘వాసుకి... హార్ట్ పెయిన్ వస్తుంది!’ చాలా సింపుల్! ఏం చెయ్యాలి సార్..?’ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయిని అమ్మాయి ముందు అన్నా అని పిలవాలి! ‘మీరు సూపర్ సార్! దెబ్బకు అమ్మాయి అన్న అని పిలవడం మానేస్తుంది!! యూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ సార్! ఇంద ఇంద తీసుకోండి.. తొక్క తీసి గుటకేసుకోండి...!’ అంటూ నీలాంబరి నవ్వింది.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com