నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్, నేను రీసెంట్‌గా పీజీ కంప్లీట్ చేశాను. నేను పీజీలో జాయిన్ అయిన సంవత్సరం ఒక అబ్బాయిని లవ్ చేశాను. సర్ ఆనెస్ట్‌గా చెబుతున్నాను ఇంతవరకు ఏ అబ్బాయినీ లవ్ చెయ్యలేదు తనని తప్ప. తెలుగు సినిమా హీరోయిన్‌లా సైలెంట్‌గా లవ్ చేశాను. బట్ చెప్పకుండా ఉండడం తప్పు అని డేర్ చేసి చెప్పాను. తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎంతగా లవ్ చేస్తున్నానో తనకి తెలుసు. కానీ ‘యాక్సెప్ట్ చేశాను’ అని చెప్పడం లేదు. నాతో క్లోజ్‌గా మూవ్ అవుతాడు. మాట్లాడతాడు. తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాను. అలా అని తనని మరచిపోయి ఇంకొకర్ని మ్యారేజ్ చేసుకుని, మ్యారేజ్ చేసుకున్న పర్సన్‌ని మోసం చెయ్యలేను అన్నయ్యా.
నేను లవ్ అంటే మెంటల్లీ రిలేటెడ్ అని నమ్ముతాను అన్నయ్యా. మన కల్చర్‌కి పెద్దల మాటలకి వాల్యూ ఇస్తాను. బట్ ట్రూలీ మై లవ్ ఈజ్ ట్రూ. వెయిట్ చేస్తా అని కూడా చెప్పాను తనకి. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను. అతన్ని మర్చిపోలేక భవిష్యత్తుని ఆహ్వానించలేక ప్రెజెంట్‌లో చచ్చి బతుకుతున్నాను. తనను మర్చిపోయి ఇంకొకర్ని మ్యారేజ్ చేసుకోలేను అన్నయ్యా. తనతోనే ఇంకొకసారి మాట్లాడాలా. ఏమీ అర్థం కావడం లేదు. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను. నా మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ తనకి లేదు. వియ్ ఆర్ నౌ గుడ్ ఫ్రెండ్స్. నేను ఏమి చేస్తే బాగుంటుందో చెప్పండి అన్నయ్యా.... ప్లీజ్...
– ఉష
‘‘సార్ ఏంటో ఇలాంటి అమ్మాయిలను చూస్తే నిజంగానే ‘లవ్ డాక్టర్ ఈజ్ బార్న్ ఫర్ దెమ్’ అనిపిస్తుంది. ఏమి చెయ్యాలి సార్ మీ చెల్లెలు?’’ లైఫ్ చాలా సింపుల్. ఏదయినా కావాలనిపిస్తే ఆ మనిషికి చెప్పాలి. ‘‘చెప్పింది కదా సార్... పడేసే దాకా తోక ఆడిస్తారు.. పడ్డాక హ్యాండ్ ఇస్తారు. మీరే చెప్పారు కదా సార్..’’ చెప్పింది సరే. తనేమనుకుంటున్నాడో చెప్పలేదు. అప్పుడు అడగాల్సిందే. ‘‘అడిగితే కాదంటే?’’ మన లాస్ అనుకోకూడదు. అతని దురదృష్టం అనుకోవాలి.
‘‘చెప్పడం ఈజీ సార్. అక్కడ గుండె పట్టేసినట్టవుతుంది.’’ మంచి అమ్మాయి. మంచి మనస్సు. తప్పకుండా దేవుడు మంచే చేస్తాడు. అడగడం వరకు ఓకే. అడుక్కోవడం నాట్ ఓకే. ‘‘మరి అరటిపండు రోజూ అడుక్కుంటారు కదా సార్’’ అంటూ నీలాంబరి నవ్వింది.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com