
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నా చెల్లెలు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడికి కూడా మా చెల్లెలంటే ఇష్టమని తెలిసి, అబ్బాయి మంచివాడు కావడంతో మా ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేశాను. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తరువాత అతనికి దుబాయ్‌లో జాబ్ వచ్చింది. మా చెల్లెలిని, పిల్లలని ఇక్కడే వదిలి తను దుబాయ్ వెళ్లాడు. దాంతో వాళ్ల ఫ్యామిలీ అంతా కలిసి ప్రతిరోజూ మా చెల్లెలిని టార్చర్ చేసేవారు. చెప్పుడు మాటలు విన్న అతడు... విడాకులు కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ మా చెల్లెలు కావాలని, పిల్లలు కావాలని ఫోన్లు చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు? – షేక్
‘సార్ ఇది దుబాయ్ ప్రేమా? దుబారా ప్రేమా? తెలుసుకుని ఆన్సర్ చెప్పండి! అమ్మాయికి అన్యాయం జరిగిపోతుందని తెగ ఫీల్ అయిపోయి.. రెచ్చిపోయి..∙ఎమోషన్‌తో నోటికొచ్చినట్లు పేలి నా రెస్పెక్ట్, అరటిపండు రెస్పెక్ట్‌కీ భంగం కలగకుండా కొంచెం సోచ్నా! కొంచెం ఆలోచించి, కొంచెం ఒళ్లు కంట్రోల్‌లో ఉంచి చెప్పండి సార్! లేకపోతే మళ్లీ మోసం హోజాతా హై! తో అబ్ క్యా కర్నా హై!’ చెల్లెలు కదా! మరి భయంగా ఉండదా? వాళ్లు మళ్లీ కష్టపెడితే ఏ అన్న అయినా భరించగలడా? అమ్మో.. చెల్లెలికి బాధ కలిగితే గుండె పట్టేస్తుంది!
‘మీరేదో చెప్పేస్తారని టెన్షన్ సార్! ఏం చేద్దాం మరి?’ఖర్జూరపండు తిందాం?‘సాఆఆర్?!!?’అమ్మాయి ఒప్పుకుంటే, అబ్బాయి మంచి వాడని కన్ఫర్మ్ చేసుకుని... ఒక అవకాశం ఇవ్వచ్చు.. అనిపిస్తుంది! హ్యాపీగా మనం కూడా దుబాయ్ వెళ్లి ఖర్జూర పండు తిందాం! అరటిపండుకు రెస్ట్ ఇద్దాం!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com