
హాయ్ అన్నయ్యా..! నాకు ఇప్పటి వరకు ఎవరి మీదా ప్రేమ పుట్టలేదు. రీజన్ ఏంటో అర్థం కావడంలేదు. కానీ, నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతోంది. తనకి ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని ఈ మధ్యే తెలిసింది. ఒకవేళ నేను కాలేజ్‌కి వెళ్లకపోతే కాల్ చేసి మరీ తిడుతోంది. ఇలా ఇబ్బంది పెడుతుండటంతో ‘నువ్వంటే నాకు ఇష్టంలేదు’ అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి ‘మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతా’నంటోంది. దాంతో నువ్వు నాకు నచ్చలేదని గట్టిగానే చెప్పేశాను. అయితే ఆ అమ్మాయి చచ్చిపోతానని బెదిరిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఆ అమ్మాయిని ఇగ్నోర్ చెయ్యడానికి ఒక మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – గౌతమ్
నీకు ఆల్రెడీ గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పు గౌతమ్!! ‘అబద్ధం చెప్పమని చెబుతున్నారా సార్?’ ఆపదలో పడొద్దని చెబుతున్నా!! ‘అమ్మాయిని నమ్మొద్దా సార్??’ మనం అబ్బాయిని నమ్మడం లేదా నీలూ?? ‘అంటే, అబ్బాయి ఊరికే వాల్యూ పెంచుకోవడానికి కట్టు కథలు చెబుతున్నాడంటారా సార్??? అంత ఆర్డినరీ ఫెలోనా సార్ అబ్బాయి? ఇంత సిన్సియర్ ఫెలోని పట్టుకుని, అబద్ధాలకోరు అంటున్నారా సార్? అసలు అబ్బాయిలకు అంత ‘లో’ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుం దా సార్? వాళ్లంటే చాలా క్రేజ్ ఉందని చెప్పుకోవడానికి..? అబద్ధాలు చెప్పి చీప్ అయిపోతారా సార్? అమ్మాయి వెంట పడుతుందని అబ్బాయి చెబితే.. అది అబద్ధం అంటారు.
అదే అబ్బాయి వెంట పడుతున్నాడని అమ్మాయిలు చెబితే.. ఓ.. ఎక్కడ లేని సింపతీ చూపిస్తారా సార్?’ ఏంటి నీలూ..? ఇప్పుడు గౌతమ్ నిజంగా నిజం చెబుతున్నాడని కదా నీ లొల్లి????? ‘అవును సార్.. పాపం గౌతమ్‌ని ఆ అమ్మాయి దెయ్యంలా పట్టి పీడిస్తోంది. వాడి స్వేచ్ఛను చికెన్ ముక్కలా గుంజి గుంజి తింటోంది. వాడి బ్రెయిన్‌ని మామిడి టెంకలా చీకేస్తోంది. ఏదైనా మంచి సలహా ఇవ్వండి సార్!’ గౌతమ్... మీ ఇంట్లో ఒప్పుకోరని చెప్పు. నీకు అసలు అమ్మాయిలంటే సిగ్గని చెప్పు. మీ వంశంలో ఎవరూ అమ్మాయిలతో మాట్లాడలేదని, మీది గొప్ప చరిత్రని చెప్పు.
మీ ఇంట్లో ఈ విషయం తెలిస్తే.. నిన్ను రూమ్‌లో పెట్టి తాళం వేస్తారని చెప్పు. అమ్మాయితో కనెక్షన్ ఉందని తెలిస్తే నీ ఫ్యూచర్ ఫినిష్ అయిపోతుందని చెప్పు. మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్లు నీ శీలాన్ని శంకిస్తారని చెప్పు. మీ ఇంటి గౌరవానికి నల్ల మచ్చగా మిగిలిపోతావని.. నీ లైఫ్ మటాష్ అపోతుందని అమ్మాయి కాళ్ల మీద పడి ప్రాధేయపడు. అది కూడా సరిపోకపోతే.... ‘ఆపండి సార్..! ఆపండి!! విషయం అర్థమయ్యింది. గౌతమ్...! ఆల్రెడీ నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పు!’
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment