
హాయ్ అన్నయ్యా... మీ సమాధానాలన్నీ చదువుతుంటాను. కొన్ని బాగా అనిపిస్తాయి కానీ, కొన్ని అస్సలు నచ్చవు. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్న తరువాత... అమ్మాయి వాళ్ల ఇంట్లో ఒప్పుకోక అబ్బాయిని వదిలేస్తే... పేరెంట్స్‌పైన ప్రేమ అంటారు. అదే కారణంతో అబ్బాయి, అమ్మాయిని వదిలేస్తే.. మోసగాడు అంటున్నారు. ఇదేం న్యాయం అన్నయ్యా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. ఇద్దరింట్లోనూ ఒప్పుకోరు. తను నా కోసం ‘అందరినీ వదిలి వస్తాను’ అంటోంది. కానీ, తనను వాళ్ల ఫ్యామిలీ నుంచి దూరం చెయ్యడం ఇష్టం లేదు. అలా అని తను లేకుండా బతకాలేను. ఏం చెయ్యాలి అన్నయ్యా? – తేజ
నువ్వు మనిషివి కాదు..... ‘సార్... ఎంత మాట అన్నారు సార్..! ఒకర్ని పట్టుకుని మనిషివి కావు అంటే.. ఎంత ఫీల్ అయిపోతాడు సార్..!? మీరు అసలు లవ్ డాక్టర్ బోర్డ్ తీసేసి.. భౌ డాక్టర్ అని పెట్టుకుంటే బెటర్ సార్..! ఇలా అబ్బాయిల మీద కొరకడానికి పరిగెడితే.. ఎలా సార్..????’ నువ్వు మనిషివి కాదు తేజా... ‘అదిగో మళ్లీ అదే ధోరణి.. ఏంటి సార్ మీరు... మారరా సార్??’ నువ్వు మనిషివి కాదు తేజా... నువ్వు... ‘సార్!!!!!!’ నన్ను చెప్పనియ్యి నీలాంబరీ....! తేజా నువ్వు మనిషివి కాదు.. మనిషి రూపంలో ఉన్న మహానుభావుడివి.
శభాష్.. అమ్మాయి కోసం, అమ్మాయి మమ్మీడాడీ కోసం.. లవ్‌ని త్యాగం చేసే నిన్ను... ‘‘లవర్స్ ఆఫ్ ఇండియా’’ లిస్ట్‌లో టాప్‌లో ఉంచాలి!! ‘సార్.. తేజాను మెచ్చుకుని అమ్మాయికి దూరం చేసే మీ ప్లాన్ వర్కౌట్ కాదు. మీ కుట్ర తేజాకు అర్థమైపోతుంది. తేజా మీ ట్రాప్‌లో పడడు సార్..!’ మంచివాడు అని చెబుతున్నా. దాన్ని ట్రాప్ అనుకుంటే ఎలా...? ఎంత మంచి మనస్సు ఉంటే అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. అయినా పేరెంట్స్‌ని పోగొట్టుకుని.. తేజ దొరికినా... అమ్మాయి హ్యాపీగా ఉండగలదా..??? అందుకే పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి.. మంచి ఉద్యోగాలు సంపాదించుకుని.. ఆ తరువాత సెటిల్ అయితే అందరూ సంతోషంగా ఉంటారు. ‘ఏంటో సార్ మీ మాటలు వింటుంటే.. నేను కూడా కన్విన్స్ అయిపోతున్నాను. ఇంద అరటి పండు!’
-ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
- లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment