
హాయ్ సార్..! నేను రెండేళ్లుగా ఒక అబ్బాయితో లవ్‌లో ఉన్నాను. ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. కానీ సడన్‌గా మా లైఫ్‌లోకి మరో వ్యక్తి వచ్చాడు. వాడు నన్ను లవ్ చేస్తున్నాడట. నేను లవ్‌లో ఉన్నాననే విషయం తెలుసుకొని, నేను లవ్ చేస్తున్న అబ్బాయిని కలిసి, చంపేస్తానని బెదిరించాడట. దాంతో నా లవర్ ఇప్పుడు నాతో మాట్లాడటంలేదు. నేను ఈ బాధని భరించలేకపోతున్నా. ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. చాలా సిన్సియర్ లవ్ సార్ మాది. మీరే మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – దివ్య
గూండా రాజ్యంలో ప్రేమ పూలు వికసించవు. పూలేంటి.. ప్రేమ మొగ్గలు తొడగనైనా తొడగవు. ప్రేమ ఆకు చిగురించదు. ప్రేమ మొక్క ఎదగదు. ‘సార్... ఈ బోటనీ క్లాస్ ఏంటి సార్??? దివ్య అడిగింది ఏంటి...??? మీరు ఫ్లోలో ఏదో పీకడమేంటి సార్??? పాపం దివ్య, ఇంకా భయపడుతుందేమో సార్???’ వాడెవడో గూండాగాడు... ‘‘నేను ప్రేమిస్తున్న, నీ తాట తీస్తా’’నంటే... మన లవర్ తోక ముడుచుకొని పారిపోయాడు. అమ్మాయి ముడుచుకుపోయి బాధపడుతోంది.
ప్రేమ పరిమళం... పరవశంతో నాట్యం చేయాల్సిన సమయంలో విచ్చుకోక, తొడగనే తొడగక, ముడుచుకుపోతే.... పొయెట్రీ రాయక ఆన్సర్ రాస్తానా నీలాంబరీ!!!???! ‘ప్చ్...! ఒక్క ముక్క అర్థం కాలేదు సార్....!’ గూండాలకు గుండు కొట్టించేది ఎవరు? ‘పోలీస్...! పోలీస్..... సార్!’మరి వాళ్లకు రాయాల్సిన ఉత్తరం నాకు రాస్తే పొయెట్రీ కాక ప్రోజ్ రాస్తానా నీలూ????
- ప్రియదర్శిని రామ్,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment