
హాయ్ అన్నయ్యా...! నేను వంశీ అనే అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. మా నేపథ్యాలు వేరు. వాళ్ల ఇంట్లో అందరూ మా పెళ్లికి ఓకే అన్నారు. కానీ మా పేరెంట్స్ ఒప్పుకోవడంలేదు. పెళ్లి గురించి వాళ్లు మాట్లాడటానికి వస్తామంటే.. ‘‘వాళ్లు వస్తే మేం చచ్చిపోతాం’’ అని మా పేరెంట్స్ బెదిరిస్తున్నారు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కుదరదని కచ్చితంగా చెబుతున్నారు. మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచీ నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. కానీ నేను ప్రేమించిన అబ్బాయి అన్నీ అర్థం చేసుకుని నన్ను చిన్న పిల్లలా చూసుకుంటాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నయ్యా. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – రాణి
ఫ్రీడమ్ ఇస్తే భయమమ్మా... కడుపు చింపుకొని కన్న అమ్మకు భయమమ్మా... రక్తం కార్చి పెంచిన నాన్నకు భయమమ్మా...నీకేమవుతుందోనని భయమమ్మా... తెలియని వయసులో నువ్వు ఏ దుర్మార్గానికి గురి అవుతావోనని భయమమ్మా... పగిలిన బంగారు తల్లిని ఎలా అతికించగలమని భయమమ్మా... ‘సార్ ఇంత ఎమోషన్‌లో రాస్తే... ఇంకెవరూ మీకు రాయరు సార్.
దుకాణం బంద్ చేసుకోవాల్సొస్తుంది. లవ్ డాక్టర్ బోర్డు విరిగిపోతే మళ్లీ అతికించుకోలేమని నాకు భయం సార్!!’ జోక్ చెయ్యకు నీలాంబరీ... రాణిని రాణిలా పెంచారు. అమ్మానాన్నలకు మళ్లీ చెప్పి చూడాలి. ‘ఒప్పుకుంటారా సార్???’ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంట్లో ఫ్రీడమ్ లేదని, వాడే ఫ్రీగా ఆడిస్తున్నాడని అమ్మాయి టెంప్ట్ అయిపోతుంది. అదే వాడి చెల్లెలు ఫ్రీగా.. చాలా ఫ్రీగా ఇంకో అబ్బాయితో తిరిగితే భరించగలడా? అమ్మాయి అర్థం చేసుకోవాలి. అన్నీ అమ్మానాన్న సమకూరుస్తుంటే ఏ పెంటగాడైనా ఫ్రీడమ్ ఇస్తాడు. ‘కరెక్ట్ సార్.. రాణి బి కేర్ఫుల్!’
Comments
Please login to add a commentAdd a comment