
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయిని ప్రేమించాను.
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. తను ఇంటర్‌లో క్లాస్‌మేట్. తనకు చాలాసార్లు ప్రపోజ్ చేశా. కానీ రిజెక్ట్ చేసింది. తన పేరెంట్స్‌కి చాలా క్లోజ్ అయ్యాను. బాగా గౌరవం ఇచ్చేవారు. ఆ వంకతో రోజూ కలుస్తున్నాను, ఫోన్‌లో మాట్లాడుతున్నాను. అయినా, అంత ప్రపోజ్ చేసినా, కనికరించడం లేదు. ఇంక మనకు ఈ లవ్‌లు వద్దు అనుకుని మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా మారుదాం అనుకున్న టైమ్‌లో తను చూపుల్తో, మౌనంతో డిస్టర్బ్ చేస్తోంది. నన్ను ఏం చేయమంటారో ఒక సలహా పారెయ్యండి డాక్టర్‌గారూ! – షేక్
‘సార్... పారెయ్యండి సార్!’ ఏంటి, తినకుండానే? ‘తిన్నాకే పారెయ్యండి సార్..’ తిన్నా... ఇదిగో తొక్క పారేశా!! ‘సార్ పారెయ్యమంది తొక్క కాదు సార్!’ మరి? ‘తొక్కలాంటి సలహా సార్!’ వాట్? ‘కోపం ఎందుకు సార్!? మీరు అబ్బాయిలకు పారేసేది సొల్లు సలహాలే కదా సార్?’ షేక్ భాయ్... ప్రేమను డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ‘పోరా పోకిరి’ అన్నట్టు కొట్టి పారేసింది. ఇండైరెక్ట్‌గా పేరెంట్స్ కాళ్లు పిసికి, కసువు ఊడ్చి, దొడ్లు కడిగి, కూరగాయలు తరిగి నీ అమోఘమైన ప్రేమను వ్యక్తం చేసినా ‘ఛీ పో’ అని మూతి తిప్పింది.
అన్నా... నీది అమర ప్రేమ! సినిమాల్లో కనపడే ప్రేమ!! నీకు ఆ అమ్మాయి సరిపోదన్నా! నీ ప్రేమకు పడిపోదన్నా! ‘చెప్పానుగా పారేస్తారని... అసలు మీకు అబ్బాయిలు లవ్ ప్రాబ్లమ్స్ రాయడమే దండగ! అయినా రాస్తూనే ఉంటారు ఎందుకు సార్!?’ లవ్ అమ్మా లవ్వు! జివ్వు నీలూ జివ్వు!! ప్రేమ దొరకలేదని... ఏడ్చే బదులు కాసేపు నవ్వుకుంటే బాధ తగ్గుతుంది కాబట్టి!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com