
హాయ్ సర్, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. కానీ అది ఎట్రాక్షన్ అనుకుని తనకి చెప్పలేదు. ఇప్పటికి తనని చూడక త్రీ ఇయర్స్ అయ్యింది. తనని మరచిపోలేకపోతున్నా. నైట్ కలలోకి కూడా వస్తుంది. తనని ఎలాగైనా మరచిపోవాలి. ఏ పని మీదా ధ్యాస ఉండటం లేదు. సార్ చెప్పండి తనని ఎలా మరచిపోవాలి? చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్...! – శ్రీకాంత్
‘సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్...!’ ఏంటి నీలాంబరీ నీకసలు ప్లీజ్ అనే అలవాటే లేదు కదా!? ‘సార్.. సార్ ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్...!’ అబ్బాయిని వెటకారం చెయ్యకుండా.... ‘సార్ ప్లీజ్.. ప్లీజ్...!’ శ్రీకాంత్ మీద జోకులు వెయ్యకుండా ఆన్సర్ చెప్పమంటావు!! అంతేనా?? ‘భలే కనిపెట్టారు ార్ మీరు..! నేను చెప్పకుండానే మీకు అర్థమయ్యిపోయింది.. ఎలా?’ ప్రేమికుల ప్రశ్నలు చదివీ చదివీ అన్నీ అర్థమయిపోతున్నాయి నీలూ...! ‘నేను నర్స్‌ని కదా సార్! నోరు జారి నన్ను కూడా ప్రేమికురాలు అంటున్నారా?’ నువ్వు అక్షరాలా ప్రేమికురాలివే నీలూ! ‘చెప్పండి చూద్దాం నేను ఎవరినీ ప్రేమిస్తున్నానో..?’ నువ్వు... ‘ఆ.. నేను..!!’ నీ వృత్తిని ప్రేమిస్తున్నావు నీలూ! ‘సార్ హాట్ పెనం మీద నీళ్లు పొయ్యమని నేను అడగడమే ఆలస్యం..! బకెట్ పోసేస్తారు.. వెరీ బ్యాడ్ సార్!!’ శ్రీకాంత్ ఇదీ విషయం.. మనకేవో ఊహలు ఉంటాయి... దాంట్లోనే జీవించాలనిపిస్తుంది. రోజూపడే కష్టాల నుంచి ఈ ఊహలు కొంచెం రిలీఫ్ ఇస్తాయి.
అజ్ఞాతంగా ప్రేమించడం కూడా అలాంటిదే.! అది తప్పు కాదు...! చిన్నప్పుడు చిన్న చిన్న ఇష్టాలు.. కోరికలు ఉంటాయి..! పెద్దగా అయినాక కూడా అవి గుర్తుకొస్తుంటాయి. గుర్తు చేసుకుని నవ్వుకోవాలి. మనం కూడా ప్రేమించాం! అని థ్రిల్ ఫీల్ అవ్వాలి. ప్రేమ అంత సంతోషాన్ని కలిగిస్తుంది. అందరి జీవితంలో అలాంటి ఒక ప్రేమ ఉంటుంది. మౌనంగా, అందంగా ఆ జ్ఞాపకాలను తలచుకోవడంలో తప్పు లేదు.
అది జీవితానికి అడ్డు అనుకోకూడదు. పార్ట్ ఆఫ్ లైఫ్. ఎంజాయ్ ది మెమోరీ! ‘సార్ ఎవరి ప్రేమను వాళ్లు మౌనంగా ఎంజాయ్ చేస్తుంటే మీరు అరటిపండును ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు కదా సార్..? మీరు ఎంత శాడిస్ట్ సార్! ఇలా సింగిల్‌గా ప్రేమించుకుంటూ ఉంటే లాభమేముంది సార్?’ దమ్ము ఉంటే ప్రేమించిన వాళ్లకు గౌరవంగా ప్రపోజ్ చెయ్యాలి. కాదు అంటే గౌరవంగా సింగిల్‌గా ప్రేమించుకుంటూ ఉండాలి. ప్రేమ ప్రేమికులకు, ప్రేమించిన వాళ్లకు సంతోషాన్ని ఇవ్వాలి కానీ, బాధను కలిగించకూడదు అని చెబుతున్నా...!! రాంగా??? ‘సార్ ప్రేమిస్తే అర్థమౌతుంది సార్...! మీకేం తెలుసు..?? ఇతరుల ప్రేమను క్యాష్ చేసుకుంటున్నారు. మీకేమి అర్థమౌతుంది సార్? తొక్కలో అరటిపండు తప్ప!!’
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment