
హాయ్ అన్నయ్యా..! నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. సహజంగానే నాది చాలా సరదాగా ఉండే లైఫ్ స్టైల్. అందరితో ఇట్టే కలిసిపోతా. కానీ అలా ఉండటం తనకి నచ్చదు. ‘‘బాయ్స్‌ని చూడొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు’’ అని రూల్స్ పెట్టాడు. తనమీద ఉన్న ఇష్టంతో అన్నీ పాటించా. కానీ, ఎప్పుడూ నా ఫోన్ ఆఫ్ అవ్వకూడదు. బిజీ రాకూడదు, తను లేకుండా బయటికి వెళ్లకూడదు, తన మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదు... ఇలా చాలానే నిబంధనలు పెడుతూ వచ్చాడు. నెలరోజుల క్రితం మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం లేట్ అయిందని, విడిపోదాం అన్నాడు. నేను ఏం మాట్లాడలేదు. మళ్లీ కాల్ చేసి ‘‘నేను లేకుండా ఉంటావా?’’ అన్నాడు. నీకు జాబ్ వచ్చాక మాట్లాడుకుందాం, అప్పటిదాకా వద్దు అన్నాను. దాంతో కొంచెం కామ్‌గా ఉన్నాడు. మంచిగా ఉండొచ్చుగా నాతో అని అడిగితే.. ‘‘నీ క్యారెక్టర్ బ్యాడ్‌గా ఉన్నంత వరకూ నేను ఇలానే మాట్లాడతా’’ అంటున్నాడు. తన కోసం ఎంతో మారాను. నేనేం తప్పు చేశానో నాకే అర్థం కావట్లేదు. తనే ప్రాణం అనుకున్నాను. కానీ ఎందుకు ప్రతిసారీ అనుమానించి అవమానిస్తున్నాడో తెలీదు. ఏదైనా సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – అఖిల
సరదాగా ఉండాలి. ‘హీరో ఒప్పుకోడు కదా సార్???’ ఎందుకు ఒప్పుకోడు? హీరోయిన్ హీరో కంటే సరదాగా ఉంటే హీరో ఒప్పుకోడు సార్!’ అంత ఇన్‌సెక్యూర్ హీరోనా మనోడు?? ‘కరెక్టే సార్.. వాడి మీద కాన్ఫిడెన్స్ ఉంటే, సరదాగా జాలీగా హ్యాపీగా ఉన్నందుకు అసలు అఖిలని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి.’ అదెలా నీలాంబరీ??? సినిమాలు చూడ్డంలేదా సార్? అమ్మాయి ఎంత యాక్టివ్‌గా ఉంటే హీరో అంతగా లవ్‌లో పడతాడు. వానలో సాంగ్ పాడుతాడు. ఎడారిలో కూడా స్టెప్పులు వేస్తాడు. గాల్లో పల్టీలు కొడతాడు. నిద్రలో మేలుకుని ఉంటాడు...’ నీలాంబరీ...!! ‘ఏంటి సార్ శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి ఒర్రినట్టు ఒర్రినారేంటి సార్???’ నీ పొయెట్రీ భరించలేకపోతున్నా... ‘అమ్మాయి కూడా అబ్బాయిని ఇక భరించకూడదు సార్!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment