నన్నడగొద్దు ప్లీజ్‌ | Love doctor Priyadarshini Ram | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Mon, Sep 24 2018 12:03 AM | Last Updated on Mon, Sep 24 2018 12:03 AM

Love doctor Priyadarshini Ram - Sakshi

హాయ్‌ రామ్‌ అన్నయ్యా, నేను ఒక అమ్మాయిని 3 సంవత్సరాల నుంచి లవ్‌ చేస్తున్నాను. కొన్నిరోజులు చాలా హ్యాపీగా ఉన్నాం. సడెన్‌గా ఒకరోజు కాల్‌చేసి ‘మీ మమ్మీ మంచిది కాదు. చాలా బ్యాడ్‌ టాక్‌ వుంది. నీకు నాకు సెట్‌ కాదు’ అని చెప్పి మాట్లాడడం మానేసింది. నాకు మాత్రం తన మెమరీసే గుర్తొస్తున్నాయి. నరకం కనిపిస్తోంది. నేనేం చెయ్యాలో మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా, ప్లీజ్‌. – నితీష్‌

ఏమి నరకంరా నితీష్‌. అమ్మను అంత మాట అంటే ఇంకా హెల్‌ అని బెల్‌ కొడుతున్నావు. ఆ పొట్టను చింపుకునే పుట్టావు కదరా తండ్రీ. మూడేళ్ల ఫ్రెండు కోసం ముక్కోటి అమ్మలకు అమ్మ.. నీ బంగారు అమ్మను అంత మాట అంటే పౌరుషం రాకపోగా.. పిల్లకోసం బెంగపెట్టుకుంటావేంట్రా బడుద్ధాయి. మనస్సు ఇచ్చిన పిల్ల, జన్మ ఇచ్చిన తల్లికంటే ఎక్కువారా మొద్దబ్బాయి. వెంటనే అమ్మ కాళ్లకు నమస్కారం చేసి, ‘మమ్మీ యూ ఆర్‌ ద గ్రేటెస్ట్‌’ అని చెప్పి, ప్రాయశ్చిత్తం చేసుకోరా డింభకా! ‘సార్‌... మరి లవ్వో..!?!’ కొవ్వు తక్కువున్న పిల్లతో చేసుకోమను.. లవ్వు!

- ప్రియదర్శిని రామ్‌ , లవ్‌ డాక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement