
నన్నడగొద్దు ప్లీజ్
అయామ్ లవింగ్ మై సిస్టర్ ఇన్ లా (మరదలు) ఫర్ త్రీ ఇయర్స్.
లవ్ డాక్టర్
అయామ్ లవింగ్ మై సిస్టర్ ఇన్ లా (మరదలు) ఫర్ త్రీ ఇయర్స్. ఐ లైక్ హర్ సిన్స్ మై చైల్డ్‌హుడ్. వన్‌డే ఐ ప్రపోజ్డ్ టు హర్. దెన్ ఆన్‌వార్డ్స్ షీ డజన్ట్ ఈవెన్ టాక్ టు మీ. బ్లాక్డ్ మీ ఆన్ ఆల్ సోషల్ మీడియా. ఐ కాన్ట్ లివ్ వితౌట్ హర్. బట్ షీ డిడ్‌నాట్ అండర్‌స్టాండ్ మై లవ్. వెన్ ఐ వెంట్ టు విష్ ఆన్ హర్ బర్త్‌డే విత్ ఎ గిఫ్ట్ షీ డిడ్‌నాట్ ఈవెన్ టాక్ టు మీ ఫర్ ఎ సింగిల్ మినిట్. షీ హేట్స్ మీ సో మచ్ దట్ షీ రిజెక్టెడ్ మై గిఫ్ట్. అండ్ లెఫ్ట్ మీ ఎలోన్ ఆన్ ద రోడ్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ శాడ్ దెన్. ప్లీజ్ హెల్ప్ మీ ఐయామ్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ హర్. హౌ షీ వుడ్ అండర్‌స్టాండ్ మై లవ్? - శ్రీరామ్
‘ఏంటి సార్ ఈ ఇంగిలిపీసు భాష..?’ వై? ‘వాట్ ఈజ్ దిస్ ఇంగ్లిష్ వింగ్లిష్!!’ ఏం నీకు ఇంగ్లిష్ రాదా? ‘ఐ కెన్ టాక్ ఇంగ్లిష్... వాక్ ఇంగ్లిష్.. రాక్ ఇంగ్లిష్... లవ్ ఇంగ్లీష్ సార్!’ నీ ఇంగ్లిష్‌తో ‘కాక’ పుట్టిస్తున్నావు.. మరి ప్రాబ్లమ్ ఏంటి? ‘అందరికీ ఇంగ్లిష్ రాదు కదా సార్!’ ఓకే!! ‘ఓకే కాదు.. ఇప్పటిదాకా ఏమి చెప్పాడో తెలుగులో చెప్పండి.. మిగతాది కూడా తెలుగులో పీకండి సార్!’ ఒక మూతలో నీళ్లు నింపి మేడ మీద ఉన్న ట్యాంక్‌లో పోసి రమ్మను. ఎందుకు సార్?’ అలా ఒక్కొక్క మూతడు నీళ్లు ట్యాంకులో పోస్తూ ఉంటే... ఆ.. పోస్తూ ఉంటే..’ ట్యాంక్ నిండుద్ది!! ‘నిండితే?’ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వడం లేదన్న బాధ తగ్గుద్ది!! ‘ఒక మూతలో నీళ్లు తీసుకొని రెండు మూడు అంతస్తులు ఎక్కి ట్యాంక్‌లో నీళ్లు నింపితే లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దా?’ పెయిన్ తగ్గుద్ది!!
‘రాసేవాడికి చదివే వాడు లోకువ అని ఊరికే అనలేదు సార్... పాపం శ్రీరామ్’ విషయం అది కాదు ఒక్కోసారి ప్రేమ వర్కౌట్ కాదు ఊరికే బెంగపడే బదులు డూ సమ్‌థింగ్ ఎల్స్... ఇంకేదయినా చేసి మనసు తిప్పేసుకో శ్రీరామ్. నేను చెప్పిన తుంటరి పని కాకపోయినా ఏదైనా పనికొచ్చే పని చేయి..‘మరి ఎందుకు సార్ మూత ఆట చెప్పారు?’ పనిష్మెంట్!ఎందుకు సార్ పనిష్మెంట్?’ బంధువులలో చేసుకుంటే పుట్టే పిల్లలు లోపాలతో పుట్టొచ్చు... నువ్వు ప్రేమించినందుకు ఏ పాపం ఎరుగని పిల్లలకు పనిష్మెంట్ పడదా... అందుకే శ్రీరామ్‌కు పనిష్మెంట్!! అయితే శ్రీరామ్‌ను బాధపెట్టినందుకు మీకూ పనిష్మెంట్. నో అరటిపండు’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com