
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నా!! నేను నా ఇంటర్ క్లాస్ మేట్‌ని లవ్ చేశాను.
లవ్ డాక్టర్
హాయ్ అన్నా!! నేను నా ఇంటర్ క్లాస్ మేట్‌ని లవ్ చేశాను. అప్పటికే తను వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. దాంతో అప్పుడు తనకేం చెప్పలేదు. అయితే మొన్న రీసెంట్‌గా ‘మాకు బ్రేకప్ అయిపోయింది’ అని చెప్పింది. నాకు క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు బాగానే ఉంది కానీ, ఏమైందో తెలీదు. ఉన్నట్టుంది నాకు నీతో మాట్లాడాలని లేదు అని చెప్పింది. ఎంత రిక్వెస్ట్ చేసినా నా మాట వినలేదు.చాలా సార్లు నా ఇగో పక్కన పెట్టి ప్రాధేయపడ్డాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్. మార్చిపోవాలా, వెయిట్ చెయ్యాలా? – సాయి కుమార్
‘సార్.. దీంతో మీరు బోర్డ్ తిప్పేయడం ఖాయం!’ అని నవ్వింది నీలాంబరి. ఎందుకో?!.. నువ్వంత ష్యూర్‌గా ఎలా చెప్పగలుగుతున్నావు?
‘అమ్మాయిని ఏమయినా అంటే మీ సిస్టర్స్ అంతా మీకు ఎదురు తిరుగుతారు.. సార్! అమ్మాయిని ఏమీ అనకపోతే.. హా.. ఈయన ఇంతే... అంత సిన్సియర్‌గా లవ్ చేస్తున్న వాడికి కూడా క్లాస్ పీకుతున్నాడు, ఈయన సిస్టర్ పక్షపాతే కాదు.. మగ ద్వేషి కూడా అని అందరూ తెలుసుకుంటారు. మీ కొంప ఐ మీన్.. మీ ప్రాక్టీస్ మునగడం ఖాయం సార్!!’ అని తెగ ఆనంద పడిపోతుంది నీలాంబరి.
అమ్మాయికి ఏమయింది? పాపం కన్‌ఫ్యూజన్‌లో ఉంది! ఇప్పుడే ఒక రిలేషన్‌షిప్‌లో టెన్షన్ పడి బయటికి వచ్చింది. సాయి కుమార్ గుడ్ బాయ్ అనుకుంది. ఈ డిఫికల్ట్ టైమ్‌లో ఫ్రెండ్‌లా ఉంటాడని కొంచెం బెండ్ అయ్యింది. విషయం మిస్ అండర్‌స్టాండ్ చేసుకుని.. సాయి కుమార్ ఫుల్‌గా ఇన్వాల్వ్ అవుతున్నడని తెలుసుకుని, కొంచెం స్పీడ్ తగ్గిస్తే బెటర్ అని, ఒక స్పీడ్ బేకర్ తగిలించింది. ఒక రిలేషన్ నుంచి ఇంకో దాంట్లోకి జంప్ కొట్టే ముందు... ఆలోచించకపోతే.. ఒక అరటిపండు తిన్నాకా జిలేబీ తిన్నట్టు ఉండదూ!?! ట్రై టు అండర్‌స్టాండ్ నీలూ...! ‘అంటే సాయి కుమార్ నూనె కారుతున్న జిలేబీలా ఉంటాడని మీ కామెంటా సార్?’ కాదు, స్వీట్ బాయ్ అని నా అర్థం! కొంచెం టైమ్ తీసుకుంటే ఇద్దరికీ మంచిది అని చెబుతున్నా! ‘మళ్లీ సేఫ్‌గా బయటపడ్డారు సార్.. ఇందా జిలేబీ..’ అని నవ్వింది నీలాంబరి!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. lovedoctorram@sakshi.com