
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! నేను, ఒక అబ్బాయి ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేసుకుంటున్నాం.
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను, ఒక అబ్బాయి ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేసుకుంటున్నాం. ఇద్దరం బాగా సెటిల్ అయ్యాక, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. బట్ నా స్టడీస్ పూర్తయిన వెంటనే నాకు జాబ్ రాలేదు. దాంతో నాకు టెన్షన్ పెరిగిపోయింది. ఈ సమయంలోనే తనకు ఇంకో అమ్మాయి పరిచయం అయ్యింది. తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. దాంతో నాకు కోపం, డిప్రెషన్ ఎక్కువైపోయాయి. బయట ఉండలేక పేరెంట్స్ దగ్గరకు వచ్చేశాను. కొన్ని రోజుల తరువాత తను నాకోసం వచ్చేశాడు.
ఆ అమ్మాయితో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పాడు. తను వెనక్కి రావడం చాలా హ్యాపీగా ఉంది కానీ, నేను ఇంకా డిప్రెషన్ నుంచి బయటకి రాలేకపోతున్నా. తనని పూర్తిగా నమ్మలేకపోతున్నా. చాలా భయమేస్తోంది లైఫ్ అంటే!! నేను తనని తప్ప ఇంకెవరినీ హజ్‌బెండ్‌లా ఊహించుకోలేకపోతున్నా. అలా చేస్తే మరొకరి జీవితాన్ని నేను పాడుచేసినట్లేగా!! నాకు ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు సార్ ప్లీజ్ సలహా ఇవ్వండి. – అను
డిప్రెషన్ కో మారో గోలి!! ‘ఏం భాష సార్ ఇది..?’ హిందీ! ‘ఇది తెలుగు పేపర్ సార్!!’ కానీ లవ్‌కి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండదు!! ‘సరే సార్ దాని అర్థం చెప్పండి. హిందీ లవ్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది..’ డిప్రెషన్‌ని కాల్చి పారెయ్యి!! ‘శభాష్ చాలా బాగుంది. గన్ మీరిస్తారా మేమే సంపాదించుకోవాలా?’ ఇట్ ఈజ్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్.. గన్ నాట్ నెసెసరీ!! ‘ముక్క అర్థం కాలా.. ఇప్పుడు ఇంగిల్‌పీస్‌లో ఏడ్చింది తెలుగులో చెప్పి...’ అలంకారికంగా మాట్లాడడం అన్న మాట!!‘లేనిది ఉన్నట్లుగానా సార్!?’
అదే అనుకో...!! ‘ఇప్పుడు మీ సిస్టర్‌కి లేని ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్లే డిప్రెషన్ అనిపిస్తుంది. రెండు అడుగులు వెనక్కి వెళ్లి చూస్తే ఉన్నదీ లేనిదీ అర్థమయిపోతుంది. డిప్రెషన్ వద్దు.. పాడూ వద్దు!! అంతా కన్ఫూజన్ వల్లే అవుతుంది. కొంచెం రిలాక్స్ అయితే అంతా క్లియర్‌గా బోధపడుతుంది అంటున్నారు కదా సార్!!’ అబ్బా ఇంత చెప్పానా నేను!? యు ఆర్ సింప్లీ గ్రేట్ నీలూ.. ఇంద అరటిపండు!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com