
హాయ్ సార్..! నేను ఇంటర్ పూర్తి చేశాను. సెకండ్ ఇయర్‌లో నా క్లాస్‌మేట్ ఒక అమ్మాయి.. ఎఫ్‌బీలో ఫ్రెండ్ అయ్యింది. ఆ తరువాత ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవాళ్లం. కాలేజ్‌లో కూడా చాలా సీక్రెట్‌గా కలిసేవాళ్లం. కావాలని తనే మాట్లాడుతూ, ఐ కాంటాక్ట్ ఇస్తూ స్మైల్ చేసేది. ఒకరోజు అనుకోకుండా హగ్ కూడా ఇచ్చింది. తనని ఎంత అవాయిడ్ చేద్దామనుకున్నా నా వల్ల కావడం లేదు. ‘నాకు లవర్ లేడు’ అని చాలాసార్లు చెప్పింది. ఫైనల్‌గా తనకు నాపైన లవ్ ఆర్ ఇంకేమైనా ఉందా? నేను అంత అందగాడిని కూడా కాదు! – సమీర్
నువ్వు అందగాడివి కాదు..! ఐతే....? ‘ఐతే ఏంటి సార్..?’ ఐతే....? ‘చెప్పండి సార్! ఐతే.. ఐతే.. అని నసిగి నసిగి టెన్షన్ పెంచేస్తున్నారు..!’ సమీర్ అందగాడు కాదు ఐతే...?..? ఐతే..? ఆమె అంధురాలు అయ్యి ఉంటుంది కదా సమీర్? ‘అంతే సార్! సమీర్ నిజం చెబితే మీరు వెటకారం చేస్తున్నారు!? అసలు.. మీతో హానెస్ట్‌గా ఉండటం అబ్బాయిలది తప్పు సార్!’ సమీర్ హానెస్ట్ అంటున్నావా నీలాంబరీ!? ‘చూడండి సార్ ఎంత హానెస్ట్‌గా తాను అందంగా ఉండను అని చెప్పుకున్నాడు కదా సార్?!’ అసలు చెప్పిన కథంతా సొల్లు కథే! ‘సార్ దాంట్లో అసలు నిజం లేదంటారా??’ ముక్క నిజం లేదు. చుక్క హానెస్ట్ లేదు.. తొక్కా లేదు.. అరటిపండూ లేదు! ‘ఎలా సార్? హౌ? మీకెలా సార్ తెలిసింది అంతా ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ అని?’ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్... ఇంత ఇంగ్లిష్ ఎక్కడ పట్టావు నీలూ? ‘సార్.. సార్.. సార్...’ ఆ వంకర్లు తిరగడం ఆపి.. అంత ఇంగిలిపీసు ఎక్కడ పట్టావో చెప్పు..?
‘నేను కూడా మీలాగే ఇంగ్లిష్ మాట్లాడాలని నేర్చుకుంటున్నా సార్.. ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ అంటే.. అంతా భ్రమ.. కట్టుకథ అని కదా సార్ మీరు అంటుంది?? అవును! ‘మీకెలా తెలిసింది సార్ అది కట్టుకథ అని??’ రెచ్చిపోతున్నాడు కదా.. హగ్ ఇచ్చిందట.. కౌగిలించుకున్న అమ్మాయిది లవ్వా? వాత పెట్టే సువ్వా? అని అడుగుతున్నాడంటే.. మీనింగ్ ఏంటి?? ‘ఒట్టి షో–అప్ గాడని!’ అమ్మాయే లేనప్పుడు.. లవ్వా జివ్వా అని అడిగితే మండదా?? ‘మండుద్ది సార్.. అరటిపండు ఫ్రూట్ పంచ్ తెస్తా ఆగండి సార్.. మీరు మేధావి సార్’ అంటూ నవ్వింది నీలూ!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment