
హాయ్ సార్..! నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తనకి ప్రపోజ్ చేస్తే ‘నో’ అంది. నెల రోజుల తర్వాత తనని కలిసి ‘మీ ఇంట్లో ప్రాబ్లమా?’ అని అడిగాను. ‘‘ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు’’ అని చెప్పింది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు. ఒకరోజు వాళ్ల అమ్మ నన్ను కలిసి ‘‘మా అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పావటగా..? నిజమేనా..?’’ అని అడిగింది. ‘‘అవునాంటీ.. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా’’ అని నిజం చెప్పేశాను. ‘‘నాకో చెల్లెలుంది, తనకు పెళ్లి కాగానే మాట్లాడదాం’’ అని పాజిటివ్‌గా స్పందించారు. అదే విషయాన్ని ఆ అమ్మాయికి చెబితే, తను నమ్మలేదు. దాంతో తనకు నమ్మకం కలిగించడానికి వాళ్ల అమ్మ చేతే చెప్పించా. అయినా సరే, నాతో కోపంగానే మాట్లాడుతోంది. తనని కూల్ చెయ్యాలంటే నేనేం చెయ్యాలి? ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి.. – కృష్ణ
‘మధ్యలో మమ్మీ ఏంటి సార్???’ కదా!!! ‘ఎక్కడైనా, మమ్మీ రెండు పీకాలి కదా సార్?’ కదా!!! ‘ఎందుకు సార్ మమ్మీ అలా చేసింది???’ కదా!!! ‘సార్, ఏంటి సార్ మీరు కూడా అమ్మాయి లాగా కృష్ణకి ఝలక్ ఇస్తున్నారు!?!’ నీలూ... పిన్ని పెళ్లి అయ్యేదాకా... ‘మధ్యలో ఈ పిన్ని ఏంటి సార్?’ మమ్మీ సిస్టర్ అంటే అమ్మాయికి పిన్నే కదా నీలూ...! ‘ఆవిడ పెళ్లి అయ్యేదాకా కృష్ణారామా అనుకుంటూ కృష్ణ ఉండాలా సార్?’ పిన్ని పెళ్లి అయ్యేదాకా హార్టుకు పిన్నీసు పెట్టుకుని ఉండాలి నీలూ...!
‘పెళ్లి తర్వాత పిన్నీసు తీస్తే అమ్మాయి ఒప్పుకుంటుందా సార్ హార్టులోకి చేరడానికి...?’ అప్పుటి సంగతి అప్పుడు చూద్దాం నీలూ... ‘ఏడిసినట్టుంది. పిన్నులు, అత్తలు పెళ్లి చేసుకునే దాకా ఆగితే కృష్ణ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఒక ఓల్డ్ ఆంటీ అయిపోతుంది కదా సార్?’ కూల్.. కూల్... నీలూ! ‘అదే అడుగుతున్నాడు సార్... కృష్ణ, అమ్మాయిని కూల్ ఎలా చెయ్యాలని?’ పిన్ని పెళ్లి భోజనాల్లో అందరికీ కూల్ డ్రింకులు ఇచ్చి అమ్మాయి మనసు దోచుకుంటాడు కృష్ణ. ‘మంచి ఐడియా సార్! అమ్మాయి పిన్ని పెళ్లికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కృష్ణే ముందుండి తంతు నడపాలి సార్. అప్పుడు అమ్మాయి కూల్‌గా ఆలోచించి కృష్ణకి ఓకే చెబుతుంది సార్. యు ఆర్ ఎ జీనియస్ సార్’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment