
హలో సార్! నేను గాయిత్రి అనే అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఈ విషయం మా ఇంట్లో తెలిసి.. మా అత్త కూతురితో నాకు ఎంగేజ్‌మెంట్ చేసేశారు. కానీ ఎంత ట్రై చేసినా నేను లవ్ చేసిన అమ్మాయిని మరిచిపోలేకపోతున్నా. దాంతో మేము అప్పుడప్పుడూ బయట కలుస్తున్నాం. చివరికి మా విషయం వాళ్ల ఇంట్లో కూడా తెలిసిపోయింది. అయినా వీలున్నప్పుడు కాల్ చేసి.. ‘సినిమాకైనా వెళ్దాం’ అంటోంది. నేను తనని అవాయిడ్ చెయ్యలేకపోతున్నా. ‘నీకు మ్యారేజ్ అయ్యేదాకానే నేను బతికి ఉండేది’ అంటోంది. అవాయిడ్ చేస్తే ఇప్పుడే ఏమైనా చేసుకుంటుందేమోనని భయపడుతున్నా. ప్లీజ్ ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్. మీ సమాధానంలో బనానా కానీ.. మరి ఏ ఇతర పండును యూజ్ చేయకండి ప్లీజ్. – గోపీనాథ్
గోపీ పేరు పెట్టుకుని నువ్వు పేరుకు తగ్గట్టు చేస్తే ఎలా బ్రో!? ‘ఏం చేశాడు సార్..???’ ఎంగేజ్‌మెంట్ చేసుకుని గర్ల్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్నాడు! ‘సార్.. యు ఆర్ సో రాంగ్ సార్!’ ఏంటి నీలూ...! నేను రాంగ్.. గోపీ రైట్.. అంటున్నావు? ‘గోపీ ఏది చేసినా అమ్మాయికోసం చేస్తున్నాడు సార్!’ తన కోసం కాదా? ‘వెటకారం వద్దు సార్.. మీరేమనదల్చుకున్నారో ఓపెన్‌గా చెప్పండి సార్!’ మనోడు ఇంకా లవ్‌లో ఉన్నాడా లేదా? ‘ఉన్నాడు సార్ కానీ..’ కానీ లేదు... మురిగిపోయిన పానీ లేదు.. గోపీ ఈజ్ చీటింగ్! ‘సార్ ఎంత మాట అనేశారు సార్.. అమ్మాయికి ఆపద కలగకూడదని శాక్రిఫైజ్ చేస్తున్నాడు సార్!’శాక్రిఫైజ్ లేదు గాడిద గుడ్డు లేదు! ‘సార్ వెరీ బ్యాడ్ సార్.
గోపీని అనుమానించడం వెరీ సాడ్ సార్!’ ప్రేమించే వాడు మరదలితో ఎంగేజ్‌మెంట్‌కి ఎందుకు ఒప్పుకున్నాడు? ‘లేకపోతే ఇంట్లో తాట తీస్తారు కదా సార్!?’ తాట తీస్తారన్న భయం ఉంటే తీట మానుకోవాలి! ‘మరి అమ్మాయి ఏమయిపోతుంది సార్!?’ అమ్మాయి ఆల్‌రెడీ అన్యాయం అయిపోయింది నీలూ! ‘అదెలా సార్?’ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రోజే అమ్మాయి అర్థం చేసుకోవాల్సింది గోపీతో వర్కౌట్ కాదని! ‘మరి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్?’ గోపీ తన మరదలికీ.. వాళ్ల పేరెంట్స్‌కీ.. విషయం చెప్పెయ్యాలి! ‘అప్పుడు ఇంట్లో వాళ్లు, అత్తింటివాళ్లు కలిసి తాట తీస్తారు కదా సార్?’ తీట, తాట, టాటా లైఫ్‌లో భాగం.
ధైర్యం ఉన్నవాడు తన సుఖం కన్నా ఇతరుల సంతోషం కోరుకోవాలి. అలా ప్రవర్తించాలి. ఆలోచిస్తే... గోపీకే అర్థం అవుతుంది. గోíపీ మంచివాడు..! ‘కానీ, అరటిపండు తినడు.. సార్’ అని నవ్వింది నీలు!
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment