
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! మాది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ! నేను ఐ.టి.ఐ అయిపోయాక ఒక సంవత్సరం జాబ్ చేసి మళ్లీ డిప్లమాలో జాయిన్ అయ్యాను
లవ్ డాక్టర్
హాయ్ సర్! మాది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ! నేను ఐ.టి.ఐ అయిపోయాక ఒక సంవత్సరం జాబ్ చేసి మళ్లీ డిప్లమాలో జాయిన్ అయ్యాను. నేను నైంత్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. మా నేపథ్యాలు వేరు. మేము కలిసేది చాలా రేర్. లాస్ట్ మంత్ వాళ్ల అమ్మ తనకి ఫోన్ కొనిచ్చారు. దాంతో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. అనుకోకుండా ఓ రోజు దొరికిపోయాం. అప్పటి నుంచి ఫ్రెండ్ ఫోన్ తీసుకుని మాట్లాడేది. అయితే ఇప్పుడు తనకి సంబంధాలు చూస్తున్నారట. త్రీ ఇయర్స్ టైమ్ అడిగింది. తను లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా తను ఉండలేదు. నేను ఇద్దరి సిస్టర్స్ పెళ్లి చేయ్యాలి. హౌస్ బాగా కట్టుకోవాలి. తను దక్కదేమో అని భయమేస్తుంది సార్. సలహా ఇవ్వండి ప్లీజ్!! – అరుణ్
ఏందన్నా ఈ లొల్లి.. ముగ్గురు సిస్టర్స్ రెస్పాన్స్‌బులిటీ ఉంది! వాళ్లకు పెళ్లి చెయ్యాలి! వాళ్ల మంచి చెడూ చూసుకోవాలి! గుడ్ బ్రదర్ అనిపించుకోవాలి! ఇన్ని గొప్ప బాధ్యతలు పెట్టుకుని.. ప్రేమలో మునిగి పోయావా బ్రదర్? మునగడమే కాకుండా ఈత కొట్టనంటావా బ్రో?
సుడిగుండంలో ఫ్యామిలీని వదిలేసి... నీ సుఖం నువ్వు చూసుకుంటానంటావా భయ్యా?
ఒక్కసారి నువ్వు ఎంత గొప్పవాడివో గుర్తుచేసుకో.. నువ్వు ఎంత మంచివాడివో నీ ఫ్యామిలీకి గుర్తు చెయ్యి! లవ్‌కి లైఫంతా ఉంది అన్నా! ముందు నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించు!! నాకు తెలుసు నువ్వు నేను చెప్పినట్లే చేస్తావని! శహబాస్ అరుణ్ అని అనిపించుకుంటావని! ‘సార్.. ఇవాళ్ల అబ్బాయితో మీరు అంత ప్రేమగా మాట్లాడారు.. ఇదిగో డబుల్ అరటిపండు!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com