
హాయ్ అన్నయ్యా! నేను డిగ్రీ పూర్తి చేశాను. లవ్ చేద్దామంటే.. ఒక్క అమ్మాయి కూడా వచ్చి ప్రపోజ్ చెయ్యడం లేదన్నయ్యా! అసలు అమ్మాయిలు వచ్చి మనల్ని ప్రపోజ్ చెయ్యాలంటే... ఏం చెయ్యాలి? ప్లీజ్ చెప్పు అన్నయ్యా!? లైఫ్ బోర్ కొట్టేస్తోంది. చదివీ చదివీ చిరాకు అనిపిస్తోంది. మా ఫ్రెండ్స్ అందరూ నీకు లవర్ లేదా అని ఏడిపిస్తున్నారు. ప్లీజ్ అన్నయ్యా మంచి సలహా ఇవ్వండి. – మురళి
ఎందుకన్నయ్యా నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు? ప్రేమలో పడితే గూబ గుయ్యిమంటుంది...! హ్యాపీగా ఉన్నావు.. బుద్ధిగా చదువుకుంటున్నావు..! నాకొచ్చే ఉత్తరాలు చదువు..! కొడుకులు ప్రేమించి.... విలవిలాడిపోతున్నారు..! నువ్వు సుఖంగా ఉన్నావని చూడలేక.. నీ పీస్ ఆఫ్ మైండ్‌ను ఓర్వలేక... నీ హ్యాపీ లైఫ్‌కి జల్స్‌గా ఫీల్ అయ్యి... నిన్ను ప్రేమలోకి నెట్టాలనుకుంటున్న కుట్రను గుర్తించు..!! డ్రైనేజ్‌లో పడినా బయటకు రాగలవు! ప్రేమలో పడ్డావో.... గూబ గుయ్యిమంటుంది..! ‘సార్ తట్ట బుట్ట ఎత్తుకోండి..! దుకాణం మూసి పోదాం!!’ ఏంటి నీలూ అలా అన్నావు? ‘వాళ్లు ప్రేమలో పడకపోతే మన బిజినెస్ ఏం గానూ..???’
మనమంతా సెల్ఫిష్‌గా ఉండకూడదు నీలూ..! ‘పొండి సార్! సెల్ఫిష్.. బిజినెస్ పక్కన పెడితే... ప్రేమలేని జీవితం కూడా ఒక జీవితమేనా సార్? ఒట్టి అరటిపండు తింటూ కూర్చుంటే బోరు కొట్టదా సార్??’ మధ్యలో మన అరటిపండు ఎక్కడ నుంచి వచ్చింది నీలూ..? ‘ప్రేమ అన్న తోటలోంచి వచ్చింది సార్! మురళికి ఎవరైనా ప్రపోజ్ చేసే ఐడియా ఒకటి చెప్పండి సార్!’ మురళీ....! ఒక ఫ్లూట్ కొనుక్కో! కాలేజ్ సెంటర్‌లో నిలబడి వాయించు..! ఇక, గర్ల్సే గర్ల్స్!! ‘వెరీ బ్యాడ్ సార్.. మీరు ఫ్లూట్ వాయించుకోండి! ఇవాళ నో అరటిపండు!!’
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment