
హాయ్ సార్..! మూడేళ్ల క్రితం నా మరదలు నాకు ప్రపోజ్ చేసింది. అప్పటికే నేను తనని ఇష్టపడుతుండటంతో ఓకే చేశాను. అయితే రీసెంట్‌గా ‘సారీ.. నేను నిన్ను సరదాగా లవ్ చేశాను. జస్ట్ నువ్వు ఎలా ఫీల్ అవుతావో చూద్దామని లవ్ అని అబద్ధం చెప్పాను’ అంది. అసలు ఎందుకు ఇలా చేసిందా? అని గట్టిగా ప్రయత్నిస్తున్న సమయంలో నాకు కొన్ని లెటర్స్ దొరికాయి. తనకు ఇంకో అబ్బాయి రాసిన లెటర్స్ అవి. అందుకే నాకు దూరమైందేమోనని సరిపెట్టుకుని, సైలెంట్ అయిపోయాను.
అయితే కొన్ని రోజులకి నాకో మరో నిజం తెలిసింది. ఆ అబ్బాయి విషయం వీళ్ల ఇంట్లో తెలిసిపోయి ఫ్యామిలీ అంతా సీరియస్ కావడంతో.. ఆ అబ్బాయిని వదిలేసిందట. ఇప్పుడు మళ్లీ మా తమ్ముడికి ప్రపోజ్ చేసిందని వాడే వచ్చి నాకు చెప్పాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ‘ఇలాంటివి వద్దురా!’ అంటే మా తమ్ముడు వినడు. నిజం చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు.
మా ఇంట్లోనో, మా అత్త వాళ్ల ఇంట్లోనో విషయం చెబుదామంటే, వాళ్లు బాధపడతారని భయంగా ఉంది. నాది లవ్ ఫెయిల్యూర్ కాదన్నా. తనే నన్ను వద్దనుకుంది. పోనీ ఇంకెవరినీ ఇబ్బంది పెట్టకుండా తనైనా హ్యాపీగా ఉండాలని నా తాపత్రయం. బట్ తనేమో అందరి జీవితాలతో ఆడుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ప్లీజ్ సార్ మంచి సలహా ఇవ్వండి. – సాయి
పగవాడికి కూడా నీలాంటి లవ్‌స్టోరీ వద్దు అన్నా..! ‘కానీ చాలా వెరైటీగా ఉంది సార్.. సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది’ ఏంటి హిట్ అయ్యేది? ‘స్టోరీ అదిరింది కదా సార్?’ ఫస్ట్ మనోడికి ఓకే చెప్పింది. సైడ్‌లో లవ్ లెటర్స్ రాసింది. ఆ తరువాత లెటర్స్ చింపి.. మనోడి తమ్ముడికి హలో చెప్పింది. ఇప్పుడు తమ్ముడు వదిన అనుకోవాలా? మనోడు మరదలనుకోవాలా? మధ్యలో ఉన్న లవర్ చిరిగిన ఉత్తరాలు అతికించుకోవాలా?
ఈ హోల్ ప్రాసెస్‌లో మనోడి మైండ్ ప్రాస తప్పి పొగలు కక్కుతుంటే.. నువ్వు సూపర్ హిట్టు.. డూపర్ హిట్టూ అని సాయి హార్ట్‌లో గునపాలు దించుతుంటే నేను భరించలేకపోతున్నా నీలూ..! ‘సార్.. మీరు కూడా లెటర్ చదువుతూ నవ్వుకోవడం నేను చూశాను సార్.. ఎందుకు అంత ఫీలింగ్ ఇస్తున్నారు సార్?’ అని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ నేల మీద దొర్లుతోంది నీలూ..! అందుకే సాయి... కొన్ని రోజులు టేకిట్ ఈజీ అమ్మాయితో కాంటాక్ట్ ఉంచుకోకు. కెరీర్ మీద దృష్టి పెట్టు..! మరదలు పిల్ల నిన్ను ఆట పట్టిస్తుంది. నువ్వు డోంట్ కేర్ లాగ ఉంటే.. హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ‘సార్..! సూపర్ హిట్ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కూడా సార్!’ అంటూ నీలాంబరి పొట్ట పట్టుకుని దొర్లుతూనే ఉంది.
- ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment