
హాయ్ అన్నయ్యా! నేను మీకు చాలా పెద్ద అభిమానిని. మీరు చెప్పే ఆన్సర్స్ సూపర్‌గా ఉంటాయి. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను లవ్ చేశాడు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయాం. ఆ తరువాత నాకు మరో అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. బట్ నేను ముందు ప్రేమించిన అబ్బాయి నాకోసమే వెయిట్ చేస్తున్నాడని తెలుసుకుని చాలా ఫీల్ అయ్యాను. తప్పు చేశాననుకొని రెండో అబ్బాయికి సారీ చెప్పి.. తనని కలుసుకున్నాను. కొన్ని రోజులు బాగానే ఉన్నాం. అయితే, నేను వాళ్ల ఇంట్లోవాళ్లకి నచ్చలేదు. మళ్లీ మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలో మా బావ నాకు ప్రపోజ్ చేశాడు. ‘నో అంటే చచ్చిపోతాను. కనీసం మాట్లాడు..’ అని అంటున్నాడు. ఇక ఇప్పుడు వాడు కూడా ‘నువ్వు కావాలి’ అంటున్నాడు. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది. వాళ్లకి ఏం చెప్పాలో అర్థం కావడంలేదు. నాకు మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – అఖిల
బంగారం.. నువ్వు చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నావు. ప్రేమ అంటే ఏంటో అర్థం కాని కన్ఫ్యూజన్‌లో ఉన్నావు. అసలు ప్రేమించకపోతే ఏమీపోదు. కొంత మంది అమ్మాయిలు అలా అనుకుంటున్నారు.
ప్రేమిస్తేనే లైఫ్ కరెక్ట్ అనుకుంటున్నారు. ప్రేమించబడితేనే వాల్యూ ఉంటుందని అనుకుంటున్నారు. నీ చుట్టూ ముగ్గురు అబ్బాయిలు ప్రేమ వలయంలో ఉన్నారు.
అవసరమా? అంటే మనం గౌరవంగా ఉన్నట్టా? లేక మనం ఈజీగా దొరుకుతామనుకుంటున్నారా? నిన్ను నువ్వు ముందు వాల్యూ చేయడం నేర్చుకో.. లైఫ్‌లో ఏదైనా మంచి గోల్ అనుకో.. కాసిన్ని రోజులు ఈ ప్రేమ పెంటలోనుంచి బయటపడు. డిస్టెన్స్ మెయింటెయిన్ చెయ్యి.. కూల్‌గా నీ లైఫ్‌ని అర్థం చేసుకో.. రేపు పెళ్లి చేసుకున్నాక అబ్బాయి మనల్ని రెస్పెక్ట్ చేసేలా ఉండాలి కానీ తక్కువగా చూడకూడదు. నా మాట విని... ఈ ప్రేమ ట్రాప్ నుంచి ముందు బయటపడి లైఫ్ గోల్ వైపు పరిగెత్తు. ‘కరెక్ట్‌గా చెప్పారు సార్! అమ్మాయిలు ప్రేమించాలి కానీ, ప్రేమకు దాసులయిపోయి లైఫ్‌ని పాడు చేసుకోకూడదు..!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment