
హాయ్ భయ్యా! నేను డిగ్రీ పూర్తి చేశాను. గ్రూప్స్‌కి చదువుతున్నా. తన పేరు ఆర్. నా చిన్నప్పటి క్లాస్ మేట్. బిటెక్ చేసి జాబ్ చేస్తోంది. మంచి అమ్మాయి. అందరితో ఫ్రీగా మాట్లాడుతుంది. కానీ వాళ్ల ఇంట్లో వాళ్లకి మాత్రం తనంటే ఇష్టం ఉండదు. తను ఏం చేసినా తిడతారు. ఇప్పుడు పెళ్లి చేసి పంపేద్దాం అనుకుంటున్నారు. అయితే లవ్ ప్రపోజ్ చేసినప్పుడే ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటా’’ అని చెప్పా. ఒప్పుకుంది. జాబ్ రాగానే చేసుకుందాం అని ధైర్యం కూడా చెప్పింది. రోజులు మారాయి. ఇంట్లో పెళ్లి పిక్స్ చేశారు. అదేంటి అంటే ఇంట్లో ఒప్పుకోరు అంటుంది. ‘‘నువ్వు ఫ్రెండ్‌లానే ఉండు, నేను నీతో రోజు మాట్లాడతా, నీకు దూరంగా మాత్రం ఉండను, నాకు అన్నీ నువ్వే అంటోంది.’’ ‘‘అయితే పెళ్లి చేసుకుందాం నాకు జాబ్ లేకపోయినా.. ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుదాం’’ అంటే వద్దంటోంది. పెళ్లిగానీ జరిగితే నీకు దూరంగా బతకలేను, చచ్చిపోతా అంటోంది. ‘‘నువ్వెందుకు చావడం? నేనే చస్తా’’ అంటే.. ‘‘వద్దు నా కోసం నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు’’ అంటోంది. ఏం చెయ్యాలి భయ్యా?? అసలు ఈ అమ్మాయి ఏం చెయ్యాలనుకుంటుందో నాకేం అర్థం కావడం లేదు. – శ్రీధర్
ఇద్దరూ బతకాలి అనుకోవాలి..! ఎప్పుడూ ‘‘చస్తాం..! చద్దాం..!!’’ అంటూ ఉంటే ప్రేమను అవమానించినట్టే...!! అమ్మాయి దొరకలేదని కొట్టుకునే బదులు....‘ఏంటి సార్ ఈ సోది? మీరు కొంచెం ఓల్డ్ అయిపోయినట్టున్నారు. యంగ్‌గా అసలు మాట్లాడ్డం లేదు. ఇలా అయితే ‘‘లవ్ డాక్టర్’’ కాదు.. ‘‘లవ్ తాత’’ అని పిలుస్తారు!! సార్... సే సంథింగ్ యంగ్!!’ అమ్మాయి దొరకలేదు అని కొట్టుకునే బదులు.. అందమైన ప్రేమను చవిచూశానని.. ఆ మధురమైన ఎక్స్‌పీరియన్స్ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చెయ్యాలి!
కానీ, అమ్మాయి దొరకలేదని డల్ అయిపోతే ప్రేమ డొల్ల అయిపోతుంది. ‘ఇప్పుడు ఏం చెయ్యాలి సార్ శ్రీధర్?!’ అమ్మాయి ఆలోచనను గౌరవించాలి. పెళ్లి చేసుకుందాం రా అంటూ ప్రెషర్ పెట్టకూడదు. అమ్మాయి స్వేచ్ఛగా ఆలోచించే స్పేస్ ఇవ్వాలి. అమ్మాయి నిర్ణయాన్ని గౌరవించాలి. డోంట్ వర్రీ... నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేనూ, నా ప్రేమ నీకు తోడుగా ఉంటాయని చెప్పాలి. ఒకవేళ వేరే సంబంధం చేసుకుంటే.. మళ్లీ నాకు ఫోన్ చెయొద్దని చెప్పాలి.
నువ్వు సుఖంగా ఉంటే చాలు.. నేను క్షేమంగా ఉంటానని’’ నీ ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవాలి. యు షుడ్ బి హియర్ హీరో! ‘శ్రీధర్ గుండె నలిగిపోయింది. ప్రేమ.. పెళ్లిగా మారలేదని ముడుచుకుపోయింది. కానీ, ఇప్పుడు మీ మంచి అడ్వైజ్‌తో మళ్లీ శ్రీధర్ గుండె పువ్వులా వికసించి ప్రేమ పరిమళాన్ని విరజల్లుద్ది. గొప్ప మనస్సు ఉన్న గొప్ప ప్రేమికుడిగా మనమందరం శ్రీధర్‌కి లైఫ్‌లో బెస్ట్ విషెస్ ఇద్దాం. ఆల్ ది బెస్ట్!!
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్